Ads
- చిత్రం : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
- నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, శ్రీనివాస్ అవసరాల.
- నిర్మాత : మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
- దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
- సంగీతం : వివేక్ సాగర్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022
Video Advertisement
స్టోరీ :
నవీన్ (సుధీర్ బాబు) వరుసగా 5 హిట్ సినిమాలు చేసిన ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్. నవీన్ తన రైటర్ (రాహుల్ రామకృష్ణ) తో నవీన్ కొత్త సినిమా గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. నవీన్ కి అనుకోకుండా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి నవీన్ కి నచ్చి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడుగుదామని అనుకుంటాడు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు. అమ్మాయి పేరు అలేఖ్య (కృతి శెట్టి) అని, ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తుంది. అలేఖ్యకి సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండవు. అలాంటి అమ్మాయిని నవీన్ తన సినిమాలో నటించడానికి ఎలా ఒప్పించాడు? చివరికి అలేఖ్య నటించిందా? అలేఖ్యకి ఎదురైన ఇబ్బందులు ఏంటి? చివరికి నవీన్ సినిమా చేశాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సమ్మోహనం, వి సినిమాల తర్వాత సుధీర్ బాబు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక ఎమోషనల్ గా సాగే సినిమాని అర్థమైపోతుంది. సినిమా మొత్తం కూడా చాలా లైట్ గా వెళ్ళిపోతుంది. అక్కడక్కడా కొంచెం కామెడీ సీన్స్ తో, మంచి పాటలతో సినిమా మొత్తం అలా సాగుతుంది. ఒక చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమా కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అలా అని బోరింగ్ గా కూడా ఉండదు. అలా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది.
కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కంటెంట్ పరంగా కూడా ఇంకా మెరుగ్గా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు ఒక కమర్షియల్ డైరెక్టర్ పాత్రలో ఆ పాత్రకి తగ్గట్టుగా నటించారు. హీరోయిన్ కృతి శెట్టి మాత్రం తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ఉండే పాత్రను పోషించారు. సహాయ పాత్రల్లో నటించిన రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది. సినిమాలో అక్కడక్కడా మంచి సీన్స్ ఉన్నా కూడా ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కథ బాగున్నా కూడా అది తెరపై చూపించే క్రమంలో ఎక్కడో పొరపాట్లు జరిగాయని అర్థమవుతూ ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించే సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సినిమాపై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనుకునేవారికి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article