Ads
- చిత్రం : హంట్
- నటీనటులు : సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్.
- నిర్మాత : వి ఆనంద ప్రసాద్
- దర్శకత్వం : మహేష్ సురపనేని
- సంగీతం : జిబ్రాన్
- విడుదల తేదీ : జనవరి 26, 2023
Video Advertisement
స్టోరీ :
ఆర్యన్ దేవ్ అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ హత్యకి గురవుతాడు. ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) అనే ఒక పోలీస్ అధికారి ఈ కేస్ మీద పరిశోధన చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ ప్రసాద్ కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అర్జున్ అంతకుముందు జరిగిన విషయాలు అన్నీ మర్చిపోతాడు. దాంతో ఆర్యన్ దేవ్ కేస్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏమీ గుర్తుండవు. అసలు అర్జున్ ప్రసాద్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ కి ఎదురైన సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అంటే తెలుగులో గుర్తొచ్చే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఒక సినిమాకి మరొక సినిమాకి అసలు పోలిక లేకుండా ఉండే లాగా చూసుకుంటూ డిఫరెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సుధీర్ బాబుకి ఆ పాత్ర చాలా బాగా సరిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే ఉంటారో అలాగే తెరపై చూపించడానికి సుధీర్ బాబు చాలా కష్టపడ్డారు అని అర్థం అవుతోంది. అలాగే సుధీర్ బాబుతో పాటు ప్రేమిస్తే హీరో భరత్ కూడా ఈ సినిమాలో నటించారు. తన పాత్ర పరిధి మేరకు భరత్ బాగానే చేశారు. కానీ ఇంకా కొంచెం నిడివి ఎక్కువగా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అలాగే హీరోతో సమానంగా ఉంటే మరొక హీరో పాత్రని శ్రీకాంత్ చేశారు. శ్రీకాంత్ కూడా తన పాత్రకి న్యాయం చేశారు.
టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ అయితే సినిమాకి మరొక హైలైట్. సినిమాలో పాటలు పెద్దగా లేవు. కానీ సినిమాని మరొక లెవెల్ కి తీసుకెళ్ళింది మాత్రం జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమా క్లైమాక్స్ కూడా అసలు ఊహించలేని విధంగా ఉంది. అది కొంచెం కొత్తగా కూడా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. కథ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- కొన్ని అనవసరమైన సీన్స్
- సాగదీసినట్టుగా ఉన్న స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే వారికి హంట్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article