ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే సస్పెన్స్ కి ఎండ్ చెప్పిన “సుధీర్”…ఇంతకీ అమ్మాయి ఎవరు?

ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే సస్పెన్స్ కి ఎండ్ చెప్పిన “సుధీర్”…ఇంతకీ అమ్మాయి ఎవరు?

by Sunku Sravan

Ads

బుల్లితెర సూపర్ కమెడియన్ గా మరియు హీరోగా యాంకర్ గా అన్నీ కలిపిన ఉగాది పచ్చడిలా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుదీర్. మరి ఆయన పెళ్లి అనేది ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న అంశం. 30 ఏళ్లకు పైగా ఉన్న సుధీరు పెళ్లి చేసుకునే సమయం దాటిపోతుంది. ఆయన స్నేహితులైన రాంప్రసాద్ శ్రీను వివాహాలు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. కానీ సుధీర్ కు మాత్రం కళ్యాణ యోగం రావడం లేదు.

Video Advertisement

ఆయన జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ ఎక్కువగా అమ్మాయిల వెంట పడే జులాయిలా ఉంటాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎక్కువగా శృంగార ప్రియుడిగా చూపిస్తారు. పదిమందిని నవ్వించడం కోసం తనకు తానే తగ్గించుకుంటూ పంచెస్ వేయించుకుంటాడు సుడిగాలి సుదీర్. ఈ తరహా కామెడీ ద్వారా ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకోవైపు సుధీర్ – రష్మీ జోడికు చాలా క్రేజ్ ఉంది. దీన్ని క్యాచ్ చేసుకొని స్పెషల్ ఈవెంట్స్ లో వీరిద్దరి వివాహం కూడా చేశారు. అయితే నటన వరకు అలా ఉన్న, రియల్ లైఫ్లో మాత్రం వీరిద్దరి మధ్య ఏముంది అనేది సస్పెన్సే. ఇద్దరూ పెళ్లి మాట ఎత్తకపోవడంతో ఒకేసారి సడన్ గా వారి వివాహ ప్రకటన చేస్తారేమో అని సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ ఫైనల్ గా సుధీర్ మాత్రం తాను చేసుకోబోయే అమ్మాయిని కూడా పరిచయం చేశాడు. ఇది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా జరిగింది. ఆదివారం రోజు ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ సంబంధించి నటువంటి ప్రోమో విడుదల అయింది. ఇందులో చాలా ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఒక్క ప్రోమో బుల్లెట్ భాస్కర్ తండ్రికి మరొక పెళ్లి చేయబోతున్నట్టు చూపించారు.

sudheer

ఆయనతో పాటుగా కమెడియన్ల తల్లిదండ్రులు కూడా దీనికి ఎంట్రీ ఇచ్చారు. ఎపిసోడ్ మాత్రం చాలా ఆద్యంతంగా సందడిగా కొనసాగింది అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చూపించారు. ఇక చివర్లో బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్ తో మీ నాన్నతో ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. మావాడు ఈ టీవీల్లోనే పెళ్లి చేసుకుంటాడా. నిజంగా చేసుకుంటాడా చేసుకోడా..? ఒకవేళ చేసుకుంటే ఇండస్ట్రీ అమ్మాయిని చేసుకుంటాడా లేదా బయట అమ్మాయిని చేసుకుంటాడా అనే విషయాన్ని అడిగాను అని అన్నారు.

sudheer-rashmi

భాస్కర్ తండ్రి అడిగిన వెంటనే సుధీర్ స్పందించారు. ఇంతమంది ఫాదర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి శ్రీదేవి డ్రామ కంపెనీ స్టేజ్ మీదనే చెప్పబోతున్న నిజంగా నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ చాలా సిగ్గుపడుతూ స్టేజ్ వైపు వెళ్ళాడు. అయితే ఆ షో లోనే ఆ అమ్మాయి ఉందని కాబట్టి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావచ్చు అని అందరు అనుకుంటున్నారు. కానీ ఈ విషయం పూర్తిగా తెలియాలంటే వచ్చేవారం షో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది.

watch video:


End of Article

You may also like