“సుడిగాలి సుధీర్” గురించి 10 ఆసక్తికర విషయాలివే.

“సుడిగాలి సుధీర్” గురించి 10 ఆసక్తికర విషయాలివే.

by Megha Varna

జబర్దస్త్ షో తో పాపులర్ అయినా వ్యక్తులు చాలామందే ఉన్నారు .అందులో సుడిగాలి సుధీర్ ముందు   వరసలో ఉంటారు.రష్మీ ,సుడిగాలి సుధీర్ కలిసి చేసే ఫన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు.జబర్దస్త్ కాకుండా ఇంకా చాలా షోస్ చేసి మెప్పించారు సుడిగాలి సుధీర్.సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

1 .ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్  మాత్రం హీరో పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని.

2 సుడిగాలి సుధీర్  సిద్దార్థ డిగ్రీ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు .

3 సుదీర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు చూడగానే సుడిగాలి సుధీర్ అంటూ పలకరించారు.ఈ సంఘటన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని ఎప్పుడూ జబర్దస్త్ కు రుణపడి ఉంటానని సుడిగాలి సుధీర్ కొన్నిసార్లు వెల్లడించారు .

4 బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ కు మరియు టాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు సుడిగాలి సుధీర్ సహాయ దర్శకునిగా పనిచేసారు.

5 డీ 9 ,డీ 10 ,జాక్ పాట్ లాంటి చాలా షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు సుడిగాలి సుధీర్.

6 సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కు రాకముందు డబ్బులు సంపాదించడానికి మేజిక్ లు చేసేవారు.మొదటగా మేజిక్ ను తన మావయ్య దగ్గర నేర్చుకున్నారు సుధీర్ .కాగా 5 వ తరగతిలో తాను చేసిన మేజిక్ కు మొదట సంపాదన వచ్చింది సుదీర్ కు .

7 .సుధీర్ తల్లి గారికి సుధీర్ ను ఒకసారి స్క్రీన్ మీద చూడాలని కోరిక ఉండేది.సుధీర్ కు కూడా ఇటువంటి కోరిక ఉండడంతో చిత్ర పరిశ్రమకు వచ్చారు.

8 మేజిక్ లు చేస్తూ స్టేజి షోస్ ఇస్తున్న సమయంలో గెటప్ శ్రీను పరిచయం అయ్యారు సుధీర్ కు .అతని ద్వారా వేణు పరిచయం అవ్వడంతో మొదటగా జబర్దస్త్ లో సుధీర్ కు అవకాశం వచ్చింది .

9 ఒక స్క్రిప్ట్ నిమిత్తం వేణు ద్వారా సుధీర్ కార్తీక్ రెడ్డి అనే దర్శకుడి దగ్గరకి వెళ్ళాడు ఆ నేపథ్యంలో సుధీర్ కు మొదటిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది .ఆ చిత్రమే “అడ్డా “.ఈ చిత్రంతో సుధీర్ కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది .

10 రేస్ గుర్రం ,టైగర్ ,సుప్రీమ్ ,సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి పలు చిత్రాలలో నటించారు సుడిగాలి సుధీర్.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న “సుడిగాలి సుధీర్” గారికి తెలుగు అడ్డా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఇలాగె కెరీర్ లో ఎదగాలని మన అందర్నీ ఎల్లప్పుడూ నవ్వించాలని ఆశిద్దాం.


You may also like

Leave a Comment