ఈటీవీ లో ప్రతి వారం వచ్చే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం లతో పాటుగా మరి కొన్ని ప్రోగ్రామ్స్ లో మనకు తప్పక కనిపించే వాడు ‘సుడిగాలి సుధీర్’.. గత కొన్ని సంవత్సరాలుగా స్కిట్స్ లలో అలరిస్తున్న ఈ ఆర్టిస్ట్. సినిమాల్లో కూడా బిజీ గా మారారు.

ఇప్పటికే కొంత మంది జబర్దస్త్ ఆర్టిస్టులు స్కిట్స్ మానివేయగా తాను మాత్రం చివరి దాకా ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటానని చెప్పారు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే కొన్ని సినిమాలో నటించిన సుడిగాలి సుధీర్ వెండితెర పై ఆ సినిమా లు అంతగా ఆదరణ నోచుకోలేదని చెప్పాలి.

ఇక కాలింగ్ సహస్ర, గాలోడు అనే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో మన ముందుకి ఈసినిమాలు రానున్నాయి. వెండి తెరపై ఎంత బిజీ గా ఉన్నప్పటికీ బుల్లి తెర ని ఎప్పటికి నిర్లక్ష్యం చేయబోనని తెలిపారు. ఎంతైనా తనకి ఇంతగా ఆదరణ నని తెచ్చిపెట్టిన బుల్లితెర ని దూరం చేసుకోవాలని ఎవరికి ఉంటుంది కదా! తనని ఆదరించి అభిమానించిన వాళ్లకి కృతజ్ఞతలు తెలిపారు.