“నా పెళ్లి జరిగేది అప్పుడే..!” అంటూ… తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్..!

“నా పెళ్లి జరిగేది అప్పుడే..!” అంటూ… తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్..!

by Mohana Priya

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎక్సట్రా జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన సుడిగాలి సుధీర్ తన స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు.

sudigaali sudheer got engaged

కొందరు జబర్దస్త్ ని వదిలివెళ్ళిపోయినప్పటికీ సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా ఇక్కడే ఉంటూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సుదీర్ కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా వేరే ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. సుధీర్ గత కొంత కాలం నుండి సినిమాల్లో హీరోగా, ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్ అయినట్టు శ్రీదేవి డ్రామా కంపెనీలో చూపించారు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత అది అబద్ధం అని తెలిసిపోయింది. తన పెళ్లిపై సుడిగాలి సుధీర్ స్పందిస్తూ ఈ విధంగా చెప్పారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, “దానికి ఇంకా టైం ఉంది” అని, “ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెప్తాను” అని చెప్పారు. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ ప్రోగ్రాం లో మాత్రమే కాకుండా, సినిమాల్లో కూడా నటిస్తున్నారు.


End of Article

You may also like