Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
Video Advertisement
జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న కమెడియన్స్ లో సుధీర్ ఒకరు. సుధీర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా షో కి మంచి రేటింగ్స్ రావట్లేదు. టీవీలో కంటే యూట్యూబ్ లో ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం జబర్దస్త్ లో నటించే నటులతో మల్లెమాల అగ్రిమెంట్ చేయించుకుంటుంది. ఈ ఏడాది కూడా కొత్త అగ్రిమెంట్ పై సంతకాలు చేయాల్సి ఉంది. కాని దీనికి సుధీర్ అంగీకరించలేదని సమాచారం.
ఇంతకుముందు అంటే వారికి జబర్దస్ ఒకటి మాత్రమే ఉండేది. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు మరి కొన్ని షోస్, అలాగే సినిమాల్లో కూడా సుధీర్ కనిపిస్తున్నారు. దాంతో వాటి వల్ల జబర్దస్త్ కి టైం కేటాయించడం కుదరట్లేదు అని, అందుకే షో చేయడం లేదు అని సుధీర్ చెప్పారు అనే వార్తలు వస్తున్నాయి. మల్లెమాల దగ్గర కూడా సుధీర్ ని ఆపడానికి కారణాలు ఏమీ లేకపోవడంతో, వారు కూడా సుధీర్ నిర్ణయాన్ని అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం అయితే వైరల్ అవుతోంది.
End of Article