Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
Video Advertisement
జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న కమెడియన్స్ లో సుధీర్ ఒకరు. సుధీర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోయారు.
ప్రస్తుతం సుధీర్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సుధీర్ ఇటీవల పార్టీ చేద్దాం పుష్ప అనే ప్రోగ్రాంకి కూడా యాంకర్ గా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాంకి సుధీర్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఒక షెడ్యూల్ కి సుధీర్ రెమ్యునరేషన్ దాదాపు 15 లక్షలు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఉన్నప్పుడు సుధీర్ 6 నుండి 7 లక్షల వరకు తీసుకునేవారు. ఇప్పుడు స్టార్ మా 10 నుండి 15 లక్షల మొత్తాన్ని ఆఫర్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ స్టార్ మా ప్రోగ్రాంలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
End of Article