మూడు రోజుల విరామం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది దర్శకుడు సుకుమార్ డెంగ్యూతో అస్వస్థతకు గురవడంతో సినిమా షూటింగ్ ఆపేశారు. మూడు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి సుకుమార్ పుష్ప సెట్లోకి అడుగుపెట్టారు. ఈ విషయంపై సినిమా బృందం మాట్లాడుతూ “సుకుమార్ కి అంత తీవ్రమైన డెంగ్యూ రాలేదు అని, అందుకే సుకుమార్ కి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు” అని చెప్పారు.

Video Advertisement

sukumar to resume pushpa shoot

సుకుమార్ పుష్ప సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. సుకుమార్ తో పాటు సినిమా బృందం అంతా కూడా రాత్రి, పగలు తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన గెటప్ మొత్తాన్ని మార్చారు. మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. మొదటి భాగం చివరిలో ఫహాద్ ఫాజిల్ ఇంట్రడక్షన్ ఉంటుంది అని సమాచారం. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తూండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.