Ads
బుల్లితెరకు పరిచయం లేని పేరు యాంకర్ సుమ అనడంలో అతిశయోక్తి లేదు.తాజాగా లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న వారికీ సహాయం చేసేందుకు యాంకర్ సుమ ముందుకొచ్చారు
Video Advertisement
‘సుమ ఫండ్ రైజర్ ఫర్ అక్షయ పాత్ర ‘పేరుతొ ఫేస్ బుక్ ద్వారా తన అభిమానుల నుండి విరాళాలు సేకరించేందుకు పిలుపునిచ్చారు .ఐదు లక్షల రూపాయలు ఫండ్ నిమిత్తం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చెయ్యగా ..ఒక్కరోజులోనే 561350 రూపాయలు రావడంతో ఆమె అనుకున్న టార్గెట్ కంటే కుంటే ఎక్కువ ఫండ్స్ రావడంతో ఆనందం వ్యక్తం చేసారు సుమ ..
నేను చెప్పగానే విరాళాలు ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు .అక్షయపాత్ర దేశమంతా పేదలకు రెండు పూటలా భోజనం అందచేస్తుంది .తెలంగాణాలో కేవలం ఐదు రూపాయలకే భోజనం అందిస్తుంది ఈ సంస్థ అని చెప్పారు . నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విరాళాలు ఇచ్చినందుకు చాలా అందంగా ఉందని సుమ తెలిపారు.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..
End of Article