ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ సంచలన కామెంట్స్..!

ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ సంచలన కామెంట్స్..!

by kavitha

Ads

ప్రముఖ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించి, ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో రాణిస్తున్నారు.

Video Advertisement

సుమన్ సినిమాలలో నటిస్తున్నా, ఆయన తరచూ రాజకీయ విషయాల పై స్పందిస్తూ ఉంటారు. అవి నెట్టింట్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలిచే పార్టీ గురించి కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నటుడు సుమన్ తిరుపతిలో ఆదివారం నాడు మీడియాతో రానున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ గురించి మాట్లాడారు. వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నట్లుగా తనపై వస్తున్న వార్తల పై స్పందించారు.  తమ పార్టీ నుండి పోటీ చేయాల్సిందిగా ఏపీలోని పలు పార్టీలు తనను సంప్రదించాయని తెలిపారు. అధికార వైఎస్సార్సీపీ నుండి రాజమండ్రి నుండి పోటీ చేయాల్సిందిగా అవకాశం వచ్చినట్టు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా రాజమండ్రి నుండే వచ్చిందని అని అన్నారు. విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, విజయ నగరం నుండే ఆఫర్స్ వచ్చాయని అన్నారు.

రాష్ట్ర విభజన తరువాత తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఇక్కడి పరిస్థితుల గురించి అంతగా అవగాహన లేకుండా పోటీ చేయలేనని చెప్పినట్లు వెల్లడించారు.  ప్రత్యక్ష ఎలెక్షన్స్ లో పోటీ చేయాలనే ఆలోచన ఇప్పుడు తనకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గురించి అడుగగా ఆయన తనకు రాజకీయ గురువని సుమన్ చెప్పారు.  ప్రత్యర్థి పార్టీలో సీట్ల సర్దుబాటు లేకుంటే వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పారు. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ పార్టీ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నా’ అని వెల్లడించారు. చిన్నపిల్లల దగ్గర నుండి సీనియర్ సిటిజెన్స్ వరకు ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అన్ని అందే విధంగా మేనిఫెస్టో పెట్టిన పార్టీకే తన సపోర్ట్ ఉంటుందని సుమన్ పేర్కొన్నారు.

Also Read: YS SHARMILA SON MARRIAGE PHOTOS: జోధ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా రాజారెడ్డి, ప్రియ వివాహ వేడుకలు… జగన్ వెళ్లలేదా,?


End of Article

You may also like