హీరో సుమన్ కూతురు “ప్రత్యూష”ని ఎప్పుడైనా చూసారా? ఆమె గొప్ప నృత్యకారిణి అని తెలుసా?

హీరో సుమన్ కూతురు “ప్రత్యూష”ని ఎప్పుడైనా చూసారా? ఆమె గొప్ప నృత్యకారిణి అని తెలుసా?

by Mohana Priya

Ads

80 లో పాపులరైన హీరోలలో సుమన్ ఒకరు. సుమన్ పూర్తి పేరు సుమన్ తల్వార్. 1979లో ఒక తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టారు సుమన్. ఆ తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నో తమిళ చిత్రాల్లో నటించారు. 1982లో ఇద్దరు కిలాడీలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Video Advertisement

ఆ తర్వాత త్రివేణి సంగమం, అపరాధి, నేటి భారతం, నవోదయం, కోడలు కావాలి ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించారు. ఒకపక్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క తమిళ సినిమాలు కూడా చేశారు. 1984 లో వచ్చిన సితార సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో గుర్తింపు సంపాదించారు సుమన్.

అప్పటినుండి న్యాయం మీరే చెప్పాలి, దర్జా దొంగ, గర్జన, ధర్మపత్ని, పెద్దింటి అల్లుడు, పరువు ప్రతిష్ట, రెండిళ్ళ పూజారి, కొండపల్లి రాజా, బావ బావమరిది, అబ్బాయి గారి పెళ్లి ఇలా వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు.

1997లో వచ్చిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గా నటించారు సుమన్. ఈ సినిమా సుమన్ ఎలాంటి పాత్రలో అయినా నటించగలరు అని నిరూపించింది. అప్పటి నుండి సుమన్ మెయిన్ లీడ్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లో కూడా నటించడం మొదలు పెట్టారు.

అలా దేవుళ్ళు, లాహిరి లాహిరి లాహిరి లో, నీకు నేను నాకు నువ్వు, కళ్యాణ రాముడు, గంగోత్రి, తొలిచూపులోనే, అతడే ఒక సైన్యం, లీలామహల్ సెంటర్, నా అల్లుడు, శ్రీరామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి, ఒక్కడున్నాడు ఇంకా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

తెలుగులోనే కాకుండా శివాజీ తో పాటు ఇంకా కొన్ని తమిళ చిత్రాల్లో, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు సుమన్. అలాగే ఠాగూర్ హిందీ రీమేక్ అయిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో కూడా తెలుగులో సాయాజీ షిండే పోషించిన విలన్ పాత్రను హిందీలో సుమన్ పోషించారు.

ప్రఖ్యాత తెలుగు రచయిత డి. వి. నరసరాజు గారి మనవరాలు అయిన శిరీష ని పెళ్లి చేసుకున్నారు సుమన్. వాళ్లకి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు అఖిలజ ప్రత్యూష. అఖిలజ ప్రత్యూష ఎంతో గొప్ప నృత్యకారిణి. అఖిలజ ప్రత్యూష ఫొటోస్ కొన్ని ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11 

#12 


End of Article

You may also like