నటుడు సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సుమంత్ కి కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ కీర్తి రెడ్డి పెళ్లి అయింది అని తర్వాత వారిద్దరూ విడిపోయారు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు సుమంత్ రెండో పెళ్లి విషయం ప్రముఖ దర్శకులు రాం గోపాల్ వర్మ వరకు ఈ వార్త వెళ్ళింది.sumanth

దీనిపై ఆర్జివి కూడా స్పందించారు. అయితే, సుమంత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను రెండో పెళ్లి చేసుకోవట్లేదు అని తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ అని. ఆ సినిమా డివోర్స్ మీద నడుస్తుంది అని ఆ కార్డు ఎలా లీక్ అయిందో తెలియట్లేదు అని సినిమా టైటిల్ ఇంకా మిగతా వివరాలు అన్నీ త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు. సుమంత్ హీరోగా నటించిన అనగనగా రౌడీ త్వరలోనే విడుదల అవుతోంది అందులో వాల్టర్ శ్రీను అనే పాత్రలో నటించారు సుమంత్.

 

watch video :