Ads
శనివారం అంటే ఆగస్టు 15 2020 న మహేంద్ర సింగ్ ధోనీ తను భారత క్రికెట్ జట్టు నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త భారత దేశ ప్రజలందరినీ షాక్ కి గురి చేసింది. ఏ విషయం అయినా ఇలాగే హఠాత్తుగా ప్రకటించే ధోని, ఈ విషయాన్ని కూడా అంతే సడన్ అందరికీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు.
Video Advertisement
చాలామంది అసలు ధోనీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణమేంటి అని ఆలోచిస్తున్నా ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ ధోని క్రికెట్ నుండి రిటైర్ రావడానికి గల కారణం గురించి ఈ విధంగా చెప్పారు.
“నాకు తెలిసి ధోని 2020 లో రాబోయే ఐపీఎల్ లో తన పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అని చూద్దాం అనుకున్నారు. నిజానికి ఐపీఎల్ మార్చి – ఏప్రిల్ లో జరగాల్సి ఉంది. ఇప్పుడు కూడా టి20 ప్రపంచ కప్ అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరుగుతుందేమో అని చూసి ఉంటారు. కానీ ప్రపంచ కప్ వాయిదా పడింది అని తెలిసి ఇంక ఈ విషయం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు అని అనుకుని ఉంటారు. అందుకే రిటైర్మెంట్ ప్రకటించి ఉంటారు.
ఒకవేళ టి20 వరల్డ్ కప్ అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరిగుంటే ఐపీఎల్ లో బాగా పర్ఫార్మ్ చేసి ప్రపంచ కప్ కు ఆడే ఇండియన్ టీం లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే వారు. అంతేకాకుండా ఇండియా చేత వరల్డ్ కప్ కూడా గెలిపించే వారు” అని అన్నారు.
టి20 ప్రపంచ కప్ అక్టోబర్ – నవంబర్ లో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రపంచ కప్ వాయిదా పడింది. టి 20 ప్రపంచ కప్ 2021 అక్టోబర్ – నవంబర్ లో భారతదేశంలో జరుగుతుంది అని, టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా లో జరుగుతుంది అని ఐసీసీ గత నెల ప్రకటించింది.
ఇదిలా ఉండగా, వచ్చే నెల మొదలు కానున్న ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆడబోతున్నారు. ఇప్పటికే శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నైలో అడుగు పెట్టారు. అక్కడ జరుగుతున్న ప్రీ – సీజన్ క్యాంప్ కి హాజరవుతున్నారు. ఆగస్టు 21న టీం సభ్యులు అందరూ యూఏఈ కి బయలుదేరుతారు. సెప్టెంబర్ 19 న ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది.
End of Article