Ads
సునీత సింగర్ గా, వాయిస్ ఆర్టిస్ట్ గా చేయడం మాత్రమే కాకుండా, ఎన్నో ప్రోగ్రామ్స్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. జీ తెలుగు లో టెలికాస్ట్ అయ్యే డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు సునీత, అయితే ఇందులో ఇటీవల పార్టిసిపెంట్స్ ఆడవాళ్ళు, మగవాళ్ళు స్నేహంగా ఉండడం అనే విషయంపై ఒక స్కిట్ చేశారు.
Video Advertisement
ఇందులో ఒక అమ్మాయి, ఒక ముగ్గురు మగవాళ్ళతో స్నేహంగా ఉంటున్నట్టు, దాని వల్ల చుట్టుపక్కల వాళ్ళు, అలాగే సమాజం ఆ అమ్మాయిని వారి మాటలతో, చేష్టలతో ఇబ్బంది పెడుతున్నట్లు మనకు చూపించారు. ఇదంతా తప్పు అని, ఒక అమ్మాయి అబ్బాయి స్నేహంగా ఉన్నంత మాత్రాన వారి ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అని అనుకోవడం తప్పు అని ఆ స్కిట్ సారాంశం.
ఈ పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత, సునీత తాను తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఆఫీస్ కొలీగ్స్ ఇవన్నీ కలిపి తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు అని, వారి వల్ల తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి అని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఇండస్ట్రీలో తనపై ఉన్న అన్ని పుకార్లు ఆ మహిళ వల్లే జరిగాయి అని తనకు అర్థం అయింది అని చెప్పారు.
“నేను ఒక అబ్బాయితో మాట్లాడినా, ఒక డైరెక్టర్ తో మాట్లాడినా నాపై ఏదో ఒక వార్తలు వచ్చేవి. నా ఫ్లాట్ నా డబ్బులతో నేను కొనుక్కోలేదు. నా కెరియర్ నేను సంపాదించుకున్నది కాదు. చెప్పలేను ఇవన్నీ. నా పక్కనే ఉంటూ, నా గురించే పక్కవాళ్లకు చెబుతూ ఉంటే వాళ్ళందరూ నమ్మేసి అదే నిజమని అనుకున్నారు. నా జీవితం మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ అలా ఉన్నప్పుడు మనల్ని నిలబెట్టి మన కోసం ఎవరైనా ఉంటారు అంటే స్నేహితులు మాత్రమే” అని చెప్పారు.
End of Article