Ads
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల టైం దగ్గరికి వస్తోంది. ఇప్పటి వరకు జనసేన, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీల మధ్య మాత్రమే పోరు నడుస్తోంది. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఈ పోరులోకి కాంగ్రెస్ కూడా చేరింది. రోజుకి ఒక జిల్లాలో షర్మిల పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
Video Advertisement
ఎన్నో విషయాల మీద జగన్ ని ప్రశ్నిస్తున్నారు. ఇంటి తగాదాలు మీద కూడా షర్మిల రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు షర్మిల వైయస్ వివేకానంద రెడ్డి గారి కూతురు అయిన సునీతతో సమావేశం అయ్యి చర్చలు జరిపారు. కడప కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ కోసం షర్మిల వెళ్లారు.
ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధికి నివాళులు అర్పించిన తర్వాత, షర్మిల సునీతతో సమావేశం అయ్యారు. షర్మిల చాలా విషయాల్లో జగన్ ని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను కూడా అడుగుతున్నారు. ఇప్పుడు షర్మిల సునీతతో భేటీ అవ్వడం అనే విషయం అందరి దృష్టిలో పడింది. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే ఆసక్తి నెలకొంది. దీనిపై ఎన్నో ఊహాగానాలు కూడా వస్తున్నాయి.
ఒక పక్క సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే వార్త బయటకు వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఇది కూడా ఒకటి. దీని మీద అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈ విషయం మీద స్పష్టత రాదు. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున సునీతని బరిలో నిలపాలి అనే ఆలోచనలో షర్మిల, ఇతర నేతలు ఉన్నట్టు మరొక వార్త వచ్చింది. ఈ విషయం మీద కూడా ఎటువంటి స్పష్టత లేదు.
ఇరు వర్గాలు కూడా ఈ విషయం మీద స్పందించకపోవడంతో ఈ అనుమానం నిజమా? కాదా? అనేది కూడా తెలియట్లేదు. అంతే కాకుండా ఈ భేటీ అయిన తర్వాత ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. దాంతో అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం మీద పలు రకాల వార్తలు బయటికి వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియలేదు.
End of Article