Home Bigg Boss 5 telugu ఈ చిన్న పొరపాటు వల్ల సన్నీ కెప్టెన్సీ వదులుకోబోతున్నారా.? (వీడియో)

ఈ చిన్న పొరపాటు వల్ల సన్నీ కెప్టెన్సీ వదులుకోబోతున్నారా.? (వీడియో)

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 6 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం.

sunny to loose captaincy in bigg boss telugu 5

ఇదిలా ఉండగా ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్ తో ఈ వారం జరిగిన గొడవల గురించి చర్చిస్తున్నారు. అయితే అనీ మాస్టర్, “టాస్క్ ఎవరికి వారే, ఇండివిడ్యువల్ గా ఆడాలి అని రాసి ఉన్నా కూడా, సన్నీ, కాజల్ కలిసి టాస్క్ ఆడారు” అని, “సన్నీకి కాజల్ సహాయం చేశారు” అని అది తనకి నచ్చలేదు అని చెప్పారు. దాంతో నాగార్జున ఈ కారణంగా సన్నీ కెప్టెన్సీ వదులుకోవాలి అని అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాలి.

watch video :

You may also like