Home Filmy Adda మన తెలుగు సినిమాల్లో వీళ్లే “సూపర్ ఉమెన్”…జెట్ స్పీడ్ లో వచ్చేస్తారు..!!

మన తెలుగు సినిమాల్లో వీళ్లే “సూపర్ ఉమెన్”…జెట్ స్పీడ్ లో వచ్చేస్తారు..!!

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రెండింగ్ టాపిక్ ఒకటే. అదే వకీల్ సాబ్. మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కోర్టులో జరిగే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య వచ్చే డైలాగ్స్, సీన్స్ అన్ని ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.

superwomen in tollywood

అయితే సినిమాలో కేస్ లో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ తో పవన్ కళ్యాణ్ కి ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఆ ఆఫీసర్ అల్వాల్ నుండి మొయినాబాద్ కి వచ్చినట్లు చెబుతారు. అందుకు పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ని సూపర్ ఉమెన్ అని అంటారు.

superwomen in tollywood

పవన్ కళ్యాణ్ “అల్వాల్ నుండి మొయినాబాద్ కి కేవలం 15 నిమిషాల్లో వచ్చారా ?” అని అడుగుతారు. అందుకు ఆ పోలీస్ ఆఫీసర్ జరిగింది తెలుసుకుని జెట్ స్పీడ్ లో వచ్చాను అని చెప్తారు.  ఈ డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలా ఇలాంటి సూపర్ ఉమెన్ పాత్రలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా కొంత మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే.

సూపర్ గర్ల్

సూపర్ మాన్ కి కజిన్ అయిన ఒక యువతి గురించి సూపర్ గర్ల్ అనే సినిమా వచ్చింది. తర్వాత 2016 లో కూడా ఇదే పేరుతో ఒక సిరీస్ వచ్చింది.

superwomen in tollywood

రకుల్ ప్రీత్ సింగ్ – సరైనోడు

సరైనోడు సినిమా లో రకుల్ ప్రీత్ నాలుగు రోజుల నుండి పరిగెత్తుతూనే ఉన్నారు అని చెప్తారు.

superwomen in tollywood

ప్రొఫెసర్ – హ్యాపీ

హ్యాపీ సినిమాలో ఒక సీన్ లో జెనీలియాతో ఒక ప్రొఫెసర్ తన మార్కుల గురించి మాట్లాడతారు. జెనీలియా పరిగెత్తుకుంటూ చాలా దూరంలో ఉన్న నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్లి మార్కులు చూసుకుంటూ ఉంటారు. అంత దూరం నుండి వచ్చారు కాబట్టి జెనీలియా అలసిపోయి ఆయాసపడుతూ ఉంటారు. కానీ జెనీలియా వచ్చిన కొన్ని సెకన్ల టైంలోనే ఆ ప్రొఫెసర్ జెనీలియా ఉన్న చోటికి వస్తారు ఆమె అలసిపోయినట్లు కూడా కనిపించరు. జెనీలియా ఆయాసపడుతూ ఉన్నా ఆవిడ మామూలుగానే మాట్లాడతారు.

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలోని ఈ సూపర్ ఉమెన్ డైలాగ్ పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

You may also like