Ads
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. ఎలక్షన్ కు ముందు బిఆర్ఎస్ పార్టీ క్యాంపైనింగ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది పనిచేశారు. గులాబీల జాతర అన్న సాంగ్ రీల్స్ చేస్తూ షేర్ చేశారు.
Video Advertisement
అలా రీల్స్ షేర్ చేసిన వారి జాబితాలో నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెటిజెన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే…!
నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. అయితే ఆమె సోషల్ మీడియాలో తాజాగా బాగా ఫేమస్ అయ్యింది. ఆమె కూతురు సుప్రీతతో కలిసి చేసే డాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతుంది. వీరిద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న సుప్రీత బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా గులాబీల జాతర అన్న సాంగ్ రీల్స్ చేసి విడుదల చేసింది.
Watch Video:
నిన్న ఎలక్షన్ రిజల్ట్ రాగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అని తెలుసుకోగానే ఇంస్టాగ్రామ్ లో తన పోస్టులు డిలీట్ చేసింది. గతంలో తన తల్లితో కలిసి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోని పోస్ట్ పెట్టింది.అయితే ఆ ట్రోలింగ్ పైన సుప్రీత స్పందించారు.
మిమ్మల్ని ఏం చేశానని ఒక రాజకీయ పరిస్థితిని ఉద్దేశించి నన్ను ట్రోల్ చేస్తున్నారు, అనవసరంగా ట్రోలింగ్ చేస్తే మా మెంటల్ హెల్త్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసా? అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. నేను బిఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన మాట వాస్తవమే కానీ నేను రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో పెట్టిన పోస్ట్ ఆయనను కంగ్రాట్యులేట్ చేస్తూ పెట్టినది అంటూ వివరణ ఇచ్చారు. అనవసరంగా ట్రోలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ వేడుకున్నారు.
Also Read:మంచి మనసు చాటుకున్న లారెన్స్… అమ్మ పేరు మీద కళ్యాణమండపం…!
End of Article