Home Filmy Adda సురేఖను బయటకు తీసుకుని రాకండి అంటూ ఫైర్..! ఇంతకీ ఏం జరిగింది?

సురేఖను బయటకు తీసుకుని రాకండి అంటూ ఫైర్..! ఇంతకీ ఏం జరిగింది?

by Megha Varna

తెలుగు సినిమా ఆడియన్స్ కి సురేఖ వాణి బాగా పరిచయమే. సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి గా, అక్క గా, అత్తగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం తో కలిసి నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. కొద్దికాలం క్రితమే ఆమె భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సురేఖ వాణి ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా పోస్ట్ చేసిన ఓ వీడియో  చర్చనీయాంశం అయ్యింది.

Surekha Vani Unseen Images

పొట్టి డ్రెస్ లు వేసుకొని ఆమె పెట్టిన పోస్ట్ లకు నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమాలో అంత సంప్రదాయంగా ఉంటారు…సోషల్ మీడియాలో ఏంటి ఇది? కూతుర్ని ఇలా పెంచకూడదు అంటూ కామెంట్స్ చేసారు ఓ నెటిజెన్. ఇది చూసిన సురేఖ వాణి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో మీరే చూడండి.

Also Check: SUREKHA VANI UNSEEN IMAGES

 

Surekha Vani Unseen Images 5

watch video:

Also read: సురేఖ వాణి కూతురి ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే..!

సురేఖ కూతురు సుప్రీత ప్రస్తుతం చదువుకుంటుంది. మరోవైపు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆమె చేసిన కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సమయం ఉన్నప్పుడల్లా తల్లితో టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు సుప్రీత. సురేఖ లాగే సుప్రీత కూడా కెరీర్ లో మంచిగా ఎదగాలని ఆశిస్తూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం.

సురేష్, సురేఖ వాణిలకు ఒక్కతే అమ్మాయి కావడంతో తనే కొడుకుగా తన తండ్రికి తలకొరివి కూడా పెట్టింది. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా నెగిటివిటిని ఎదుర్కుంది.మా జీవితాల్లో మేము ఎంత సఫర్ అవుతున్నామో అనేది నీకు తెలీదు అంటూ ఎమోషనల్ మెసేజెస్ కూడా పోస్ట్ చేసింది.

You may also like