“స్కూల్ లో అలాంటి పని చేశాను..! టెన్త్ క్లాస్ లో మా అమ్మకి తెలియకుండా..?” అంటూ… “సురేఖ వాణి” కూతురు కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“స్కూల్ లో అలాంటి పని చేశాను..! టెన్త్ క్లాస్ లో మా అమ్మకి తెలియకుండా..?” అంటూ… “సురేఖ వాణి” కూతురు కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Mounika Singaluri

Ads

ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఇప్పుడు సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ తో గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ నటుడు అమర్‌దీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమంతో మొదలు అయ్యింది. అయితే, ఇటీవల సుప్రీత ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Video Advertisement

surekha vani daughter comments in an interview

రీతు చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ అనే ఒక ప్రోగ్రాంకి సుప్రీత అతిథిగా వెళ్లారు. సుప్రీతతో పాటు అమర్‌దీప్ కూడా ఈ ప్రోగ్రాంకి వెళ్ళారు. అయితే ఇందులో యాంకర్ రీతు, “మీ లైఫ్ లో కిక్ తో చేసే కొన్ని పనులు, క్రాక్ తో చేసే కొన్ని పనులు ఉంటాయి. అలా ఏం చేశారో చెప్పండి” అని అడిగారు. మొదట సుప్రీత మాట్లాడుతూ, తనకి 15 -16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లో తెలియకుండా, తన తల్లికి చెప్పకుండా ఆమె నిద్రపోతున్నప్పుడు కారు తీసుకొని బయటికి వెళ్లే దాన్ని అని, లైసెన్స్ లేకుండా కారు నడిపే దాన్ని అని, అలా ఒకసారి దొరికిపోవడంతో సురేఖ వాణి తనని కొట్టారు అని చెప్పారు.

Surekha vani Daughter supritha naidu Photos Images

తర్వాత కిక్ తో చేసిన పనులు గురించి రీతు అడిగారు. అందుకు అమర్‌దీప్, “ఫ్రెండ్స్ తో మందు కొట్టి సీసాలు దొరకకుండా దాచేసే వాళ్ళం” అని చెప్పారు. ఈ విషయం మీద సుప్రీత మాట్లాడుతూ, “నేను కూడా అలాంటివి చేశాను. కానీ ఇప్పుడు చెప్పలేను. కానీ నేను టెన్త్ క్లాస్ లో చేసిన పని ఏంటంటే, మేము ఒక గ్యాంగ్ ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాలి అని ఉండేది. నేను మా అమ్మకి తెలియకుండా మందు బాటిల్ స్కూల్ కి తీసుకెళ్లి నా ఫ్రెండ్స్ అందరికీ తాగించాను. తర్వాత మా కోఆర్డినేటర్ కి దొరికిపోయాం” అంటూ చెప్పారు. తర్వాత క్రాక్ తో చేసిన పని గురించి మాట్లాడుతూ, అమర్‌దీప్, తాను ఇష్టపడ్డ అమ్మాయి తననే చూడాలి అని అనుకునేవాడిని అని చెప్పారు.

Surekha Vani daughter Supritha Naidu Latest Photos

“ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు వేరే అబ్బాయి వస్తే, ఆ అమ్మాయి అతనిని చూసింది అనే కోపంలో పక్కనే ఉన్న గ్లాస్ పగలగొట్టాను” అని చెప్పారు. అందుకు సుప్రీత అందుకుంటూ, తాను అలా కాదు అని, తాను ఇష్టపడేవారు తనని మాత్రమే చూడాలి అని అనుకోలేదు కానీ, తను ఇష్టపడే వారిని వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం కొట్టేవారు అని చెప్పారు. “ఆ అమ్మాయి, అబ్బాయిని చూస్తోంది అని వెళ్లి కొట్టిన రోజులు ఉన్నాయి. మేము ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళు వస్తే తంతాను. అలాగే తన్నేదాన్ని. ఆ అబ్బాయిని ఏమనే దాన్ని కాదు. కానీ తర్వాత వదిలేసే దాన్ని” అని చెప్పారు.

watch video :

ALSO READ : రామ్ చరణ్ “జరగండి” పోస్టర్‌లో ఇది గమనించారా..? ఈ పుస్తకానికి ఇంత గొప్ప చరిత్ర ఉందా..?


End of Article

You may also like