Home Bigg Boss 5 telugu బిగ్ బాస్ 5 లో తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి… కానీ వెంటనే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు..?

బిగ్ బాస్ 5 లో తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి… కానీ వెంటనే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు..?

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.Surekha Vani Instagram story about bigg Boss entry

గత నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు 5వ సీజన్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు స్టార్ మా యాజమాన్యం. ఈ సీజన్ కి కూడా గత రెండు సీజన్లకి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో షూట్ కూడా ఇటీవల జరిగింది. ఇందులో నాగార్జున పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Surekha Vani Instagram story about bigg Boss entry

ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంత మంది పేరు సోషల్ మీడియాలో వెళుతున్నాయి. అందులో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా ఉన్నారు. సురేఖ వాణి ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అనే పుకార్లు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సురేఖ వాణి ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక మెసేజ్  షేర్ చేశారు.Surekha Vani Instagram story about bigg Boss entry

తను బిగ్ బాస్ ప్రోగ్రాం లో పాల్గొనడం లేదని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టారు సురేఖ వాణి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సురేఖ వాణి డిలీట్ చేసేసారు. మరి దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి? సురేఖ వాణి బిగ్ బాస్ కి వెళ్తున్నారా? ఇప్పుడే ఆ విషయం బయట పెట్టడం కరెక్ట్ కాదు అని అలా స్టోరీ షేర్ చేశారా? లేదా ఇంకేదైనా కారణమా? ఏదేమైనా, అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ఈసారి ఎవరు రాబోతున్నారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

You may also like