Ads
సూర్యగ్రహణం వలన కరోనా చచ్చిపోతుందా అని గూగుల్ లో సెర్చ్ చేసేవారి సంఖ్యపెరిగిపోతుంది.. ప్రపంచానికి పట్టిన కరోనా పీడా సూర్యగ్రహణం ద్వారా అయినా వీడుతుందా అని నమ్మకంతో వెతుకుతున్నారు భారతీయులు..గ్రహణాల పట్ల మన దేశంలో అనేక నమ్మకాలు ఉన్న విషయం తెలిసిందే..మనవారి నమ్మకాలకు ఆజ్యం పోసాయి ఒక సైంటిస్ట్ చెప్పిన మాటలు.. ఇంతకీ ఆ సైంటిస్ట్ ఏమన్నారు..ఆయన మాటలపై WHO స్పందన ఏంటి అనేది చదవండి..
Video Advertisement
2019 డిసెంబర్ 26న ఏర్పడిన సూర్యగ్రహణానికి కరోనా వైరస్ కు సంబంధం ఉందని..విచ్చిత్తి శక్తి కారణంగా సూర్యగ్రహణం తర్వాత విడుదలయ్యే న్యూట్రాన్ల కణ సంఘర్షణ ఫలితంగా కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చని చెన్నైకి చెందిన న్యూ క్లియర్, ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ అన్నారు.న్యూ ట్రాన్లు రియాక్ట్ అవ్వడంతోనే పైన ఆకాశంలో బయో న్యూ క్లియర్ ఇంటరాక్షన్ ఏర్పడిందని, ఈ బయో – న్యూ క్లియర్ ఇంటరాక్షన్ కారణంగా కరోనా వైరస్ ఉద్భవించిందని చెప్పారు. దాంతో అప్పుడు గ్రహనం ద్వారా ఉద్బవించిన వైరస్ ఈ గ్రహణంతో అయినా పోతుందా అని భారతీయులు ఆశపడుతున్నారు..
ప్రచారమని కొట్టి పారేసిన WHO
సూర్య గ్రహణం రోజున సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల ఉష్ణోగ్రత పెరగొచ్చని, వైరస్ చావదని WHO తేల్చి చెప్పింది..సూర్యగ్రహణం మూలంగా వైరస్ చనిపోతుందని వచ్చే వార్తల్లో నిజంలేదని అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది.
15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని నుంచి కిరణాలు భూమిని చేరేలోపే శక్తిహీనమవుతాయని, వాటి ద్వారా కరోనా పోదని అంటోంది. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మాస్క్ లు ధరించడం, చేతుల్ని శుభ్రం కడుక్కోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గం అని సూచించింది.
End of Article