Ads
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో మొదలైనప్పటి నుండి కరోనా ఎలా వచ్చింది అనే దానిమీద భిన్న కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.గబ్బిలం ద్వారా వచ్చిందని, అలుగు ద్వారా వచ్చిందని ,ల్యాబ్ లో తయారు చేసిన జీవాయుధమే అని పలు అభిప్రాయాలూ వెలువడ్డాయి కానీ దేనికి కూడా పూర్తి ఆధారాలు లేవు.అయితే 2019 లో వచ్చిన సూర్య గ్రహణమే కరోనా వైరస్ కు కారణమని చెన్నై కి సంబందించిన ఓ శాస్త్రవేత్త చెబుతున్నారు.వివరాల్లోకి వెళ్తే..
Video Advertisement
చెన్నై కి చెందిన శాస్త్రవేత్త సుందర కృష్ణ ANI news తో మాట్లాడుతూ…డిసెంబర్ 26 2019 లో సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుని ద్వారా ఫిషన్ ఎనర్జీ భూమి మీదకి వచ్చి తద్వారా నూట్రాన్స్ పరివర్తనం చెందడం వలనే కరోనా వైరస్ పుట్టిందని అంటున్నారు.2019 వ సంవత్సరం లో గ్రహాలలో కూడా తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయని ఆ ఒత్తిడి కారణంగానే కరోనా వైరస్ భూమి పై మొదలైంది అని సుందరకృష్ణ అంటున్నారు.
అయితే జూన్ 21 2020 న మళ్ళీ సూర్యగ్రహణం రాబోతుంది.కాగా ఈసరి వచ్చే సూర్యగ్రహణానికి కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుంది అని సుందరకృష్ణ అన్నారు.అయితే ఇప్పటికే కరోనా వైరస్ ఎప్పుడు పోతుంది అనే దానిమీద చాలామంది చాలారకాలుగా చెప్పారని అసలు ఏది నిజం తెలియట్లేదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
source: ANI
End of Article