2020 సినీ ప్రపంచానికి ఎందరో కళాకారులని దూరం చేస్తోంది. ముందు ఇర్ఫాన్ ఖాన్, తన మరణం నుండి తేరుకోక ముందే రిషి కపూర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్. పోయిన ఆదివారం చిరంజీవి సర్జా. నిన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ముందు ఉన్న వాళ్లందరిది సహజ మరణాలు. సుశాంత్ ది బలవన్మరణం. నిన్న పొద్దున్న తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.
టీవీ నటుడికి కాల్:
ఓ నేషనల్ మీడియా నివేదిక ప్రకారం, సుశాంత్ చనిపోయే ముందురోజు రాత్రి, శనివారం, అతనితో పాటు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. అతను ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం. కాల్ డేటాను పరిశీలిస్తే… అర్ధరాత్రి, అతను ఒక టీవీ నటుడికి కాల్ చేసాడు, కానీ ఆ నటుడు సమాధానం ఇవ్వలేదు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో సుశాంత్ తన సోదరితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
10 గంటలకు ఒక గ్లాసు జ్యూస్ తాగి:
10 గంటలకు అతను ఒక గ్లాసు జ్యూస్ తాగి ఆ తర్వాత తన గది లోపలికి వెళ్లి తాళం వేసుకున్నాడు. ఎప్పుడు ఫ్రెండ్లీ గా ఉండే సుశాంత్ ఆ రోజు మాత్రం కొంచెం చిరాకుగా ఉన్నారని సెక్యూరిటీ గార్డు తెలిపారు. ఆ తర్వాత సుశాంత్ అతను కాల్‌కు సమాధానం ఇవ్వకపోయేసరికి, అటెండర్ సహాయం కోసం స్థానిక కీ మేకర్‌ను పిలిచాడు. అతని స్నేహితుడు పోలీసులకు విషయం తెలిపారు.. తలుపులు పగలగొట్టి చూసేసరికి అతను సీలింగ్ ఫ్యాన్ నుండి వేలాడుతున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటన 12: 30-12: 45 సమయంలో చోటుచేసుకుంది.
నెలకు రూ.4.5 లక్షల అద్దె:
ఇది ఇలా ఉండగా పోలీసులు సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించారు. సుశాంత్ ఇటీవలే బాంద్రాలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్‌కు మారారు. దానికి నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నారట. ఆ ఫ్లాట్ లో అతనితో పాటు ముగ్గురు పనివాళ్ళు ఉన్నారంట.