Ads
సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది.తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లో ఆరు పేజీలతో కూడిన ఫిర్యాదును సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఇచ్చారు.ఇందులో రియా చక్రవర్తి సుశాంత్ ను తన ఫ్యామిలీ నుండి దూరం చేయడానికి సుశాంత్ సిమ్ లు అస్తమానం మారుస్తుండేది అని పేర్కొన్నారు.
Video Advertisement
అలాగే సుశాంత్ డెబిట్,క్రెడిట్ కార్డ్స్ రియా చక్రవర్తి తన విలాసాల కోసం వాడేదని కేకే సింగ్ ఫిర్యాదులో తెలిపారు.ఇక సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి 15 కోట్ల రూపాయలు తనకు సంబంధం లేని వ్యక్తుల అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి.దీని పై పోలీసులు ఖచ్చితమైన దర్యాప్తు నిర్వహించలని ఆయన అన్నారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ బెడ్ ను సర్దుతున్న పోలీసులు ఇక ఈ వీడియో బయటికి వస్తే మనం అయిపోతాం అని మాట్లాడుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది.దీనితో సుశాంత్ కేసును ముంబై పోలీసులు ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారో చూడండి అంటూ నిన్న రిపబ్లిక్ టివిలో ప్రముఖ యాంకర్ అర్ణబ్ గోస్వామి అన్నారు.
ఇక ఇప్పటికే బీహార్ పోలీసులు సుశాంత్ కేసు కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చేరుకున్నారు.సినిమాలలో హీరోలు ఎప్పుడు గెలుస్తారు మరి సుశాంత్ కేసులు నిందితులకు శిక్ష పడి ఆయన గెలుస్తారో లేదో వేచి చూడాలి.
End of Article