Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకి ఒక కొత్త కోణం బయటపడుతోంది. రియా చక్రవర్తి పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు రియా చక్రవర్తి మాట్లాడిన ప్రతిసారీ తనకి సుశాంత్ అంటే ఇష్టం అని, సుశాంత్ మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా రియా నే తీసుకెళ్లినట్టు మాట్లాడారు.
Video Advertisement
కానీ ఇటీవల సుశాంత్ తరుపున వాదించే లాయర్ ఇవన్నీ అబద్ధాలు అని అసలు రియా సుశాంత్ ఎలా ఉన్నాడు అనే విషయం కూడా పట్టించుకోలేదు అని తెలిపారు. అంతేకాకుండా సుశాంత్, రియా కలిసి ముంబైలోని ఒక డూప్లెక్స్ ఇంట్లో ఉండే వాళ్ళు.
కొన్నిసార్లు స్నేహితుల తో కలిసి అక్కడ పార్టీ చేసుకునేవాళ్ళు. చాలా సార్లు సుశాంత్ కింద ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో పడుకుంటే, రియా మాత్రం పైన రూమ్ లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేవారట.
రియా చక్రవర్తికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని, సుశాంత్ కి కూడా డ్రగ్స్ అలవాటు అయి ఉండొచ్చు అని, ఆ మత్తులోనే సుశాంత్ మరణించి ఉండవచ్చు, లేదా తనని ఆత్మహత్యకి ప్రేరేపించి ఉండవచ్చు అని సుశాంత్ లాయర్ అన్నారు.
అంతేకాకుండా రియా చక్రవర్తి సుశాంత్ ని చివరిసారిగా కలిసింది జూన్ 8వ తేదీన. ఆరోజు రియా సుశాంత్ తో గొడవ పడిందని, అదే రోజు ఎనిమిది హార్డ్ డిస్క్ లు కూడా ధ్వంసం అయ్యాయని సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని చెప్పారు. ప్రస్తుతం సుశాంత్ కేసు మీద సీబీఐ ఎంక్వయిరీ జరుగుతోంది.
End of Article