సుశాంత్ ఫ్యామిలి సంచలన నిర్ణయం…గుడ్ బై సుశాంత్ అంటూ నోట్ విడుదల..!

సుశాంత్ ఫ్యామిలి సంచలన నిర్ణయం…గుడ్ బై సుశాంత్ అంటూ నోట్ విడుదల..!

by Mohana Priya

Ads

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి పదిహేను రోజులు అయింది. ఇటీవల సుశాంత్ తండ్రి కె కె సింగ్ మీడియాతో మాట్లాడారు. సుశాంత్ చనిపోయిన 13 వ రోజున అతని కుటుంబం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఆ నోట్ లో ఈ విధంగా పేర్కొన్నారు.

Video Advertisement

సుశాంత్ స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడేవాడు, చాలా బాగా మాట్లాడేవాడు, అంతే తెలివికలవాడు కూడా. ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకునేవాడు. ఎంతో పెద్ద కలలుకన్నాడు, ఎటువంటి భయం లేకుండా వెనకడుగు వేయకుండా ఆ కలలని నిజం చేసుకున్నాడు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. మా కుటుంబం గర్వపడే అంత స్థాయికి ఎదిగాడు అంతేకాకుండా మా కుటుంబం లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. తనకి తన టెలిస్కోప్ అంటే ఎంతో ఇష్టం. దాంతో నక్షత్రాలను చూస్తూ ఎంతసేపైనా కూర్చునేవాడు.

తన నవ్వు, అన్నిటినీ ఎంతో ఆసక్తిగా చూసే కళ్ళు ఇంకా మాకు కనపడవు అన్న నిజాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే గంటలకొద్దీ సైన్స్ గురించి తాను చెప్పే విషయాలు కూడా ఇంక మేము వినలేము. తన మరణం మా కుటుంబంలో ఒక భర్తీ చేయలేని స్థానాన్ని మిగిల్చింది. తన ప్రతి ఒక్క ఫ్యాన్ ని ఎంతో గౌరవించే వాడు. మా మీద ఇంత అభిమానం ప్రేమ చూపించినందుకు మీ అందరికీ చాలా థాంక్స్.

సుశాంత్ జ్ఞాపకార్థం మేము అందరం కలిసి తన పేరు మీద సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సుశాంత్ కి ఎంతో ఇష్టమైన సినిమా, సైన్స్, క్రీడల కి చెందిన ఎంతోమంది కళాకారులకి, విద్యార్థులకి, ప్లేయర్ లకి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాం.

సుశాంత్ చిన్నప్పుడు నివసించిన పాట్నాలోని రాజీవ్ నగర్ లో ఉన్న ఇంటిని తన మెమొరబిలియా గా మార్చాలి అనుకుంటున్నాం. అందులో తన టెలిస్కోప్, పుస్తకాలు, ఫ్లైట్ స్టిమ్యులేటర్ ని తన అభిమానులు చూడడం కోసం పెట్టాలని అనుకుంటున్నాం.

అలాగే తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్లను అలానే ఉంచుతాం. అందులో సుశాంత్ వి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ చూస్తే తను మనతో ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అకౌంట్ లని డిలీట్ చేయడం లేదు.మీరందరూ అందించిన సహకారానికి, ప్రార్థనలకు, పంపించిన సందేశాల కి మరొక సారి ధన్యవాదాలు.ఇది సుశాంత్ కుటుంబం విడుదల చేసిన ప్రెస్ నోట్ యొక్క సారాంశం.


End of Article

You may also like