Ads
ధోని చిత్రం లో హీరో గా నటించిన సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో బాలీవుడ్ సినీ వర్గంతో పాటు ఇతర చిత్ర పరిశ్రమలు కూడా విషాదంలో మునిగిపోయాయి.అయితే ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖలందరు సుశాంత్ కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ మరణాన్ని జీర్ణించుకోలేక బీహార్ లోని పూర్ణియాలో అతడి వదిన(కసిన్ బ్రదర్ భార్య) సుధా దేవి కన్నుముశారు. .ఆ వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
34 యేళ్ళ సుశాంత్ సింగ్ రాజపుట్ తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు గాను డిప్రెషన్ కు వెళ్లి బాంద్రా లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.అయితే సుశాంత్ మరణ వార్త తెలిసినప్పటి నుండి సుశాంత్ కజిన్ భార్య రోదిస్తూ ఆహారం తీసుకోవడం మానేశారు.కాగా ముంబై లో సుశాంత్ కు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు సుశాంత్ కజిన్ భార్య కన్ను మూసారు.సుశాంత్ తో పటు ఆమె కూడా మృతిచెందడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.అయితే సుశాంత్ మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.
End of Article