Ads
సుశాంత్ సూసైడ్ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది.ఇక తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై బీహార్ లో ఫిర్యాదు చేశారు.ఇది ఇప్పుడు దేశమంతా పెద్ద ఎత్తున సంచలనమవుతుంది.
Video Advertisement
ఇక తాజాగా సుశాంత్ సిస్టర్ శ్వేత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేపుతుంది.అసలు కథేంటంటే శ్వేత, సుశాంత్ సూసైడ్ చేసుకునే నాలుగు రోజులు ముందు అతనితో చాట్ చేసింది.ఇప్పుడు ఆ వాట్స్ అప్ చాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ పోస్టులో సుశాంత్ తమని వదిలి వెళ్ళడం ఇంకా తమని బాధిస్తుందని తన పేరంట్స్ కు సుశాంత్ చాలా ఇష్టమని అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారని సుశాంత్ కజిన్ శ్వేత ఓ ఎమోషనల్ మెసేజ్ పెట్టారు.ఇక సుశాంత్ సూసైడ్ కేసును విచారించడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ చేరిన బీహార్ పోలీసులు ముంబై పోలీసులు తరహాలోనే చాలా సైలంట్ గా ఉంటున్నారు.పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉందని అందుకని ఈ కేసును ఎలాగైనా సిబిఐకి అప్పజెప్పాలని సినీ అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
End of Article