Ads
బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను అటు పోలీసులు విచారుస్తుంటే. మరోపక్క సినీ అభిమానులు ఆ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి టైంలో పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్ సుశాంత్ సింగ్ తో మాట్లాడినట్లు తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది.
Video Advertisement
ఈ వీడియోలో స్టీవ్ హుఫ్ తన దగ్గర ఉన్న డివైస్ ను ఉపయోగించి ఆత్మలతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నాడు.గత పదేళ్లుగా ఈ డివైస్ ను ఉపయోగించి స్టీవ్ హుఫ్ చాలామందితో మాట్లాడినట్లు క్లైమ్ చేస్తున్నాడు.సుశాంత్ తో మాట్లాడటం కోసం మొదటి ట్రైల్ గా ఈ వీడియోను చేశానని ఆతర్వాత చేయనున్న వీడియోలో సుశాంత్ సూసైడ్ వెనుక ఉన్న నిజాలను అతని చావుకు కారణమైన వాళ్ళ గురించి తెలుసుకుంటానని స్టీవ్ హుఫ్ చెబుతున్నాడు.మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
End of Article