Home Filmy Adda సుశాంత్ ఆత్మతో అతను మాట్లాడాడు అంట… ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.!!

సుశాంత్ ఆత్మతో అతను మాట్లాడాడు అంట… ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.!!

by Megha Varna

బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను అటు పోలీసులు విచారుస్తుంటే. మరోపక్క సినీ అభిమానులు ఆ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి టైంలో పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్ సుశాంత్ సింగ్ తో మాట్లాడినట్లు తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో స్టీవ్ హుఫ్ తన దగ్గర ఉన్న డివైస్ ను ఉపయోగించి ఆత్మలతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నాడు.గత పదేళ్లుగా ఈ డివైస్ ను ఉపయోగించి స్టీవ్ హుఫ్ చాలామందితో మాట్లాడినట్లు క్లైమ్ చేస్తున్నాడు.సుశాంత్ తో మాట్లాడటం కోసం మొదటి ట్రైల్ గా ఈ వీడియోను చేశానని ఆతర్వాత చేయనున్న వీడియోలో సుశాంత్ సూసైడ్ వెనుక ఉన్న నిజాలను అతని చావుకు కారణమైన వాళ్ళ గురించి తెలుసుకుంటానని స్టీవ్ హుఫ్ చెబుతున్నాడు.మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

 

You may also like