Ads
సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయిన తర్వాత నుండి ప్రతి సెలబ్రిటీ తన గురించి చెప్తుంటే అతను ఎంత మంచివాడో, ఇండస్ట్రీ లో ఎంత మంది స్నేహితులు ఉన్నారో తెలుస్తోంది. కానీ అలా హఠాత్తుగా చనిపోవడం వెనక ఉన్న కారణం ఎవరికీ తెలియట్లేదు. ఇటీవల సుశాంత్ కి ఎంతో సన్నిహితురాలు అయిన నటి లారెన్ గాట్లిబ్ సుశాంత్ ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు నాలుగేళ్ళ క్రితం చేసిన చాట్ యొక్క స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
Video Advertisement
సుశాంత్ రాబ్తా సినిమా కోసం బుడాపెస్ట్ లో షూటింగ్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఎక్కడ ఉన్నావు అని లారెన్ అడిగితే షూటింగ్ కోసం బుడాపెస్ట్ కి వచ్చాను అని సుశాంత్ చెప్పాడు. ఈ మధ్య ఎక్కడ చూసినా అందరు నీ గురించే మాట్లాడుకుంటున్నారు . ఏం సినిమా ? ధోని ఆ? అని లారెన్ అడిగింది.
దానికి సుశాంత్ కాదు. ధోని షూటింగ్ అయిపోయింది. సెప్టెంబర్ 2 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇల్ల్యూమినాటి వాళ్ళది . తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ (కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ) లో షూటింగ్ ఉంది అని జవాబిచ్చాడు. తన పంజాబీ సినిమా హిట్ అయింది అని తర్వాత బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాలు చేయాలి అని ఉంది అని.అందుకే చిన్న ప్రాజెక్ట్ లు వచ్చినా నో చెప్తున్నాను అని. ఇంక ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి పెద్ద సినిమాల్లో కి వెళ్ళడానికి కష్టపడాలి అని లారెన్ సుశాంత్ తో చెప్పింది.
అప్పుడు సుశాంత్ తను కూడా అదే అనుకుంటున్నాను అని. తనకి కూడా టీవీ ఇండస్ట్రీ వదిలి బాలీవుడ్ కి రావడం ముందు కష్టం గానే అనిపించింది అని. కానీ తను తీసుకున్న నిర్ణయాల వల్ల నిలదొక్కుకోగలిగాను అని చెప్పాడు.అపుడు లారెన్ తనకి భాష రాదు అని. పంజాబీ భాష కూడా కష్టం గా ఉన్నా ఎలాగో అలా మేనేజ్ చేయగలిగాను అని. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ సంప్రదాయం, భాష పై తనకి పట్టు లేదు అని చెప్పింది.
ఒక యావరేజ్ గా కనిపించే, యావరేజ్ టాలెంట్ ఉన్న నాలాంటి వ్యక్తే బాలీవుడ్ లో అడుగు పెట్టినపుడు. నీ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు ట్రై చేయకూడదు? నీకు చాలా గొప్ప టాలెంట్ ఉంది. నిన్ను నువ్వు నమ్ము. కొంచెం ఓపిక గా ప్రయత్నించు తప్పకుండాపెద్ద స్టార్ వి అవుతావు అని సుశాంత్ లారెన్ తో అన్నాడు.
అప్పుడు లారెన్ సుశాంత్ ఇచ్చిన ప్రోత్సాహానికి థాంక్ యు చెప్పి ఇంకొకసారి తనని తను యావరేజ్ అనుకోవద్దు అని. ధోని సినిమా కి అల్ ది బెస్ట్ అని చెప్పింది. సుశాంత్ కూడా లారెన్ కి అల్ ది బెస్ట్ చెప్పి, ఎపుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు కలుద్దాం అని చెప్పాడు.
ఇదంతా సుశాంత్ ఎంత మంచివాడో, తన తోటి నటులకు ఎంత గౌరవం ఇస్తాడో. ఎంత పాజిటివ్ గా ఉంటాడో, తను గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా అని చెప్పడానికి లారెన్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పక్క సుశాంత్ లాంటి మంచి వ్యక్తి చనిపోయాడు అని బాధ అనిపిస్తున్నా, మరో పక్క తను చనిపోవడానికి డిప్రెషన్ మాత్రమే కాకుండా ఇంకా ఎదో చాలా బలమైన కారణం ఏమైనా ఉండి ఉంటుంది ఏమో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
End of Article