Ads
కొన్ని రోజుల క్రితం బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.అయితే సుశాంత్ మరణం బాలీవుడ్ అంతటా కలకలం రేపుతోంది.సుశాంత్ తన తల్లి మీద ప్రేమతో ఓ లేఖ రాసారు.అయితే ఆ లేఖ ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తూ వైరల్ గా మారింది.
Video Advertisement
సుశాంత్ లేఖ లో తన తల్లి గురించి ప్రస్తావిస్తూ .
నువ్వు ఉన్నంత కాలం నేను ఉన్నాను. కానీ ఇప్పుడు మీ జ్ఞాపకాలతోనే నేను సజీవంగా ఉన్నాను. ఓ నీడ వలే. కాలం ఎన్నటికి కదలదు. ఇది ఎంతో అందంగా ఉంది. ఇది ఎప్పటికి ఇలానే కొనసాగుతుంది.
నీకు గుర్తుందా అమ్మా ?.. ఎప్పటికి నువ్వు నాతోనే ఉంటానని నాకు మాటిచ్చావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా!
అమ్మ నీకు గుర్తుందా..ఎప్పటికి నాతోనే ఉంటానని నాకు మాట ఇచ్చావ్.అలాగే ఎలాంటి పరిస్థితులలో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను.ఇంతకీ చుస్తే మన ఇద్దరం ఇచ్చిన మాటలు తప్పు అని తెలుస్తుంది అంటూ రాసారు.ప్రస్తుతం సుశాంత్ రాసిన లేఖ పై నెటిజన్లు బావోద్వేగంగా స్పందిస్తున్నారు.
సుశాంత్ కు చిన్ననాటి నుండి తన తల్లిపై అమితమైన ప్రేమ ఉండేది.చాలాకాలం క్రితం సుశాంత్ తల్లి మరణించారు అయినా సుశాంత్ తన తల్లిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ బాధపడుతూ ఉండేవారు.అయితే సోషల్ మీడియా లో తన ఆఖరి పోస్ట్ కూడా తన తల్లిని ఉద్దేశించి రాయడం గమనించాల్సిన విషయం.
End of Article