సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజు నుండి మీడియా తన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ వాళ్ళు బాధ లో ఉండడం వల్ల మాట్లాడనికి ఇష్ట పడలేదు. ఇటీవల సుశాంత్ తండ్రి    కే కే సింగ్ మీడియా తో మాట్లాడారు.

“ఎన్నో ప్రార్థనలు చేస్తే పుట్టాడు సుశాంత్. నలుగురు అమ్మాయిల లో ఒక్కడే అబ్బాయి తను. మూడేళ్లు ప్రార్థన చేసిన తర్వాత పుట్టాడు. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా కావాలనుకుంటే అదే తొందరగా దూరమవుతుంది. సుశాంత్ విషయం లో అలానే జరిగింది.

సుశాంత్ ఇంత చిన్న వయసు లో నే చాలా చేసాడు. చాలా సాధించాడు. కుటుంబం తో చాలా క్లోజ్ గా ఉండేవాడు. అన్నీ చెప్పుకునేవాడు. సినిమాల నుండి తన వ్యక్తిగత జీవితం లో ఏం అవుతుంది అనే ప్రతి విషయం మాతో చెప్పేవాడు. కానీ ఇలా ఎందుకు చేసాడో అర్ధం కావట్లేదు. ఇంక అయినదాన్ని ఎవరు ఆపగలం.

తను చివరిగా నాతో మాట్లాడినప్పుడు తన పెళ్లి విషయం వచ్చింది. కరోనా కారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం కష్టమని. తర్వాత తనకి సినిమా షూటింగ్ ఉంది అని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో చేసుకుంటానని చెప్పాడు. అదే చివరి సారి తనతో నేను మాట్లాడటం.

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటివి అవుతుండవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా ఎదిగినప్పుడు ఓర్వ లేక పోవడం, వాళ్లని కిందకి లాగాలి అని ప్రయత్నం చేయడం, వాళ్ల మీద లేనిపోని మాటలు చెప్పడం. ఇలాంటి ఎన్నో జరుగుతుండవచ్చు” అని అని చెప్పారు.

సుశాంత్ కి ఎంతో సన్నిహితురాలైన అంకిత గురించి మాట్లాడుతూ “అంకిత మాతో మాట్లాడడానికి ముంబై వచ్చింది. పాట్నా కి కూడా వచ్చి మమ్మల్ని కలిసింది.  అంకిత పై మాకు ఎటువంటి చెడు అభిప్రాయమూ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి బ్రేకప్ విషయం వాళ్లు ఆలోచించి మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. దాన్ని మేము గౌరవిస్తాం” అని అన్నారు సుశాంత్ తండ్రి కే కే సింగ్.

Follow Us on FB:


Sharing is Caring: