సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య కేసును కూడా సిబిఐ కి అప్పగించాలని కుటుంబసభ్యుల డిమాండ్.!

సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య కేసును కూడా సిబిఐ కి అప్పగించాలని కుటుంబసభ్యుల డిమాండ్.!

by Megha Varna

Ads

దేశాన్ని విస్తుపోయేలా చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు రోజుకొక మలపు తిరుగుతుంది. ఎంతోమంది ప్రముఖులు ఇది ఆత్మహత్య కాదు హత్య అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.సరిగ్గా సుశాంత్ చనిపోయే వారం ముందు ఆయన మేనేజర్ దిశా సలియాన్‌ కూడా 14వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.దీనితో వీరిద్దరి మరణానికి ఏదైనా కారణం ఉండి ఉండవచ్చని ప్రముఖులు అనుమానాలు వక్తం చేస్తున్నారు.

Video Advertisement

ఇలాంటి టైంలో ముంబై పోలీసులు దిశా సలియాన్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ధ్వంసం చేశామని చెప్పడంతో పోలీసుల తీరు పై బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా తాజాగా రిపబ్లిక్ టీవీ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న సుశాంత్ ఫ్యామిలి ఫ్రెండ్ స్మిత పారిఖ్ తమ మేనేజర్ ను చంపిన వాళ్ళు తనని కూడా వదలరని సుశాంత్ సోదరి మీతూ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మరణం వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు దాని ఇన్ ఫ్లుఎన్స్ కు భయపడే పోలీసులు సరిగ్గా పని చేయట్లేదని ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇన్ని రోజులు సైలంట్ గా ఉన్న దిశా సలియాన్‌ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సుశాంత్ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చాలా రోజుల నుండి పలు వర్గాల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రోజుకొక మలుపు తిరుగుతున్న సుశాంత్ కేసు చివరికి ఎటు చేరుతుందో వేచి చూడాలి.


End of Article

You may also like