సుశాంత్ చనిపోయిన నెల రోజులకి తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి స్పందించారు. సుశాంత్ అంటే తనకి ఎంత ఇష్టమో చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తర్వాత సుశాంత్ ఆత్మహత్య మీద సి.బి.ఐ ఎంక్వయిరీ చేయాలి అని అమిత్ షా ని రిక్వెస్ట్ చేశారు. ఇదంతా ఇలా ఉండగా, పోలీసులు మళ్లీ ఒకసారి రియా చక్రవర్తిని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం ఏంటంటే.

Video Advertisement

ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ కోసం సుశాంత్, రియా కలిసి యూరప్ కి వెళ్లారట. ఫ్లైట్ టికెట్ ఖర్చు రియా చక్రవర్తి భరించారు. యూరప్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఉండడానికి, ఇంకా మిగిలిన ఖర్చులు అన్నీ సుశాంత్ భరించారు.

గత 11 నెలలుగా సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి భారీ మొత్తంలో డబ్బులు డ్రా అయ్యాయి. ఆ డబ్బులను రియా ఉపయోగించుకున్నారు అనే వార్త ప్రచారం అవుతోంది. అందుకే ఇదంతా ఎంత వరకు నిజమో ఎంతవరకు అబద్దమో తెలుసుకోవడానికి పోలీసులు రియా చక్రవర్తిని మరొకసారి ఎంక్వైరీ చేయనున్నారు.

సుశాంత్ చనిపోయిన కొద్ది రోజులకి రియా చక్రవర్తిని ముంబై పోలీసులు 9 గంటల పాటు విచారించారు. సుశాంత్ డిప్రెషన్ కౌన్సిలింగ్ కి తనతో పాటు రియా కూడా వెళ్ళేది. కాబట్టి కౌన్సిలింగ్ అప్పుడు ఎలా ఉండేది, సుశాంత్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది అనేదానిపై ఎక్కువ దృష్టి పెట్టి విచారణ చేశారు. ఇప్పుడు కేసు లో మరొక కోణం బయటికి రావడంతో మళ్లీ ఒకసారి ముంబై పోలీసులు రియా చక్రవర్తిని విచారించనున్నారు.