Ads
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు…కాయ్‌పోచే, పీకే, రబ్తా, కేదార్‌నాథ్ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
Video Advertisement
సుషాంత్ మరణంతో బాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది..సుశాంత్ ఇప్పటివరకు చేసినవి మంచి సినిమాలే..ఇకపై చేయడానికి చేతిలో సినిమాలున్నాయి..మరి సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి..
ఇది ఆత్మహత్య కేసు అని పోలీసులు అనుమానించారు, కాని అక్కడ సూసైడ్ నోట్ దొరకలేదు. ఆదివారం, అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో డాక్టర్ ఆర్‌ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి కోవిడ్ 19 పరీక్ష, పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. తాత్కాలిక పోస్టుమార్టం నివేదికను బాంద్రా పోలీస్ స్టేషన్ వైద్యులు సమర్పించారు.
ముగ్గురు వైద్యుల బృందం # సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ శవపరీక్ష నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయనది ఆత్మహత్యే అని తేలింది. ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. కరోనా టెస్టు కూడా నిర్వహించారు. అది నెగటివ్ గా తెలిసింది. ఒకవేళ పొయిజాన్ తీసుకున్నారేమో అను అనుమానంతో అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు సుశాంత్ అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు.
పాట్నాలో నివసిస్తున్న సుశాంత్ కుటుంబం ముంబైకి బయలుదేరింది మరియు ఈ రోజు విలే పార్లేలో అంత్యక్రియలు జరుగుతాయి. 1986 జనవరి 21న పట్నాలో సుశాంత్ సింగ్ జన్మించాడు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసారు. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో సేవా సంస్థ కూడా నిర్వహిస్తున్నాడు.
End of Article