కంటతడి పెట్టిస్తున్న “సుశాంత్” ఇంస్టాగ్రామ్ చివరి పోస్ట్…ఆ రెండిటి మధ్య బతుకుతున్నానమ్మా.!

కంటతడి పెట్టిస్తున్న “సుశాంత్” ఇంస్టాగ్రామ్ చివరి పోస్ట్…ఆ రెండిటి మధ్య బతుకుతున్నానమ్మా.!

by Megha Varna

Ads

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని  అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు…కాయ్‌పోచే, పీకే, రబ్తా, కేదార్‌నాథ్ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

Video Advertisement

సుషాంత్ మరణంతో బాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది..సుశాంత్ఇప్పటివరకు చేసినవి మంచి సినిమాలే..ఇకపై చేయడానికి చేతిలో సినిమాలున్నాయి..మరి సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

సుశాంత్ మరణ వార్త తెలియగానే డిప్రెషన్ కారణంగానే మరణించాడు అనే వార్తలు వచ్చాయి..లాక్ డౌన్ కారణంగా కొంతకాలంగా ఒక్కడే ఉంటున్న సుశాంత్ డిప్రెషన్ కి గురయ్యాడని, వాటికి బలం చేకూరుస్తూ డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటన్నట్టుగా సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యం అయ్యాయి.

ఇది ఇలా ఉండగా…సుశాంత్ తన ఇంస్టాగ్రామ్ లో చివరగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది. “మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా” అంటూ భావోద్వేగంతో తన తల్లి గురించి జూన్ 3 న సుశాంత్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది.


End of Article

You may also like