రియాకి సుశాంత్ తండ్రి పంపిన వాట్సాప్ మెసేజ్ ఇదే…మధ్యలో శృతి మోదీ ఎవరు?

రియాకి సుశాంత్ తండ్రి పంపిన వాట్సాప్ మెసేజ్ ఇదే…మధ్యలో శృతి మోదీ ఎవరు?

by Mohana Priya

Ads

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేస్ రోజుకి ఒక మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం సిబిఐ వాళ్ళు సుశాంత్ ఆత్మహత్య కేసు ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తి కూడా గత రెండు రోజులుగా విచారణకు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సుశాంత్ తండ్రి తను రియా చక్రవర్తి తో, అలాగే సుశాంత్ బిజినెస్ మేనేజర్ శృతి మోదీ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ విడుదల చేశారు.

Video Advertisement

సుశాంత్ తండ్రి, శృతి మోదీ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ లో ” సుశాంత్ డబ్బులు ఇంకా లోన్ కి సంబంధించిన విషయాలన్నీ నువ్వే చూసుకుంటున్నావు అని నాకు తెలుసు. ఇప్పుడు తను ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి తనతో మాట్లాడాలి అనుకున్నాను. నిన్న సుశాంత్ తో మాట్లాడాను. తను చాలా కంగారు పడుతున్నట్టు చెప్పాడు.

సుశాంత్ అలా మాట్లాడితే ఒక తండ్రి గా నాకు ఎలా ఉంటుందో, నేను ఎంత భయపడతానో నువ్వే ఆలోచించు. అందుకే నీతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ నువ్వు కూడా మాట్లాడట్లేదు. అందుకే నేనే ముంబై కి వద్దాం అనుకుంటున్నాను. ఫ్లైట్ టికెట్స్ పంపించు” అని పేర్కొన్నారు.

రియా చక్రవర్తి కి సుశాంత్ తండ్రి పంపించిన సందేశం లో ” నీకు నేను సుశాంత్ తండ్రి అని తెలిసినప్పుడు నాతో ఎందుకు మాట్లాడలేదు? అసలు విషయం ఏంటి? నువ్వు ఒక ఫ్రెండ్ లాగా సుశాంత్ కి వైద్యం చేయిస్తూ, తనని చూసుకుంటున్నప్పుడు, నాకు కూడా నీతో మాట్లాడి సుశాంత్ ఎలా ఉన్నాడు అని తెలుసుకునే బాధ్యత ఉంటుంది కదా. అందుకే నాకు కాల్ చెయ్. సుశాంత్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాల గురించి నాకు కూడా చెప్పు” అని పేర్కొన్నారు.


End of Article

You may also like