Ads
సుశాంత్ సింగ్ మరణం తరువాత సినీ అభిమానులు ఆయన చావుకు కారణమంటూ వినిపించిన సినీ సెలబ్రెటీస్ అందరినీ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేశారు.అందులో సుశాంత్ సింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్
అంకిత లోఖండే కూడా ఉన్నారు.
Video Advertisement
అంకిత లోఖండే అసలు పేరు తనూజా.పవిత్ర రిస్తా చేస్తున్న సమయంలో తన ముద్దు పేరైన అంకిత ను స్క్రీన్ నేమ్ గా పెట్టుకోమని సుశాంత్ సింగ్ రికమెండ్ చేశాడట.ఆ సీరియల్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.దాదాపు ఆరేళ్ళు కలిసి డేటింగ్ చేసిన ఈ జంట ఆతరువాత విడిపోయారు.బ్రేకప్ అయినప్పటికీ వారిద్దరూ ఫ్రెండ్లీగానే ఉండేవారు.ఎప్పుడూ ఫోన్‌లో, సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు టచ్‌లో కూడా ఉండేవారని ఇరువురి సన్నిహితులు చెబుతున్నారు.
అయినప్పటికి కొందరు ఔత్సాహికులు సుశాంత్ సింగ్, అంకిత లోఖండే తో బ్రేక్ అప్ అయినప్పటి నుండి అతను డిప్రెషన్ లోకి వెళ్ళాడని అతడు సూసైడ్ చేసుకోవడానికి అంకిత లోఖండే కూడా ఒక కారణమని ఆమె ను ఆమె బాయ్ ఫ్రెండ్ ను ట్రోల్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ మరణం అనంతరం సుశాంత్ కుటుంబం ను మొదటిగా అంకిత లోఖండే నే కలిసింది.సుశాంత్ తండ్రి కేకే సింగ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్నాకు వచ్చి తన కుటుంబ సభ్యులను ఓదార్చి మాతో కలిసి బాధను పంచుకున్న అతి కొద్ది మందిలో అంకిత లోఖండే ఒకరు అన్న విషయాన్ని స్వయంగా ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు.
End of Article