Ads
వారసత్వం కోరలలో చిక్కుకున్న బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఒంటరిగా అడుగుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన సుశాంత్ సింగ్ హఠాత్ మరణం యావత్ దేశాన్ని ఓ కుదుపు కుదుపేసింది.సమాజంలో మంచి పేరు తనకంటూ అభిమానులను సంపాదించుకున్న సుశాంత్ సింగ్ సడన్ గా అత్మహత్య చేసుకోవడం ఎంతోమందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.సుశాంత్ సింగ్ ఆత్మహత్య గురించి రోజుకొక వార్త బయటకొస్తుంది.తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో సుశాంత్ సింగ్ సూసైడ్ కు ముందు గూగుల్లో తన గురించే సెర్చ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు.అతడి గురించి గత కొద్దికాలంగా వస్తున్న నెగిటివ్ కథనాలు చదివాక సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారని ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్నారు.
Video Advertisement
సుశాంత్ తన ఆత్మహత్య కు కొద్దిరోజులు ముందు నుండి తనని టార్గెట్ చేస్తూ, మీడియాలో వస్తున్న కథనాల పై తన టీమ్ తో మాట్లాడేవాడట.అదే విధంగా జూన్ 14న ఆత్మహత్యకు ముందు ఉదయం 10:15 సమయంలో సుశాంత్ ప్రూట్ జ్యూస్ తాగుతూ తన పేరునే గూగుల్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
గత కొంతకాలంగా సుశాంత్ మరణం పై వస్తున్న వదంతులలో నిజములేదని ఇటీవల పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యింది. అయినప్పటికి ఇంకా సుశాంత్ సన్నిహితులు ఈ పోస్టుమార్టం రిపోర్ట్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి కారణమంటూ ఆరోపణలు వచ్చిన మూవీ సెలబ్రిటీస్ ను ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు.ఇప్పటికే దాదాపు పోలీసులు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సహా మొత్తం 30 మందిని విచారించారు.
End of Article