విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది.సామాజిక దూరం పాటించడం తప్ప చేసేది ఏమి లేక ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..కరోనా కారణంగా అమెరికా ,ఇటలీ వంటి దేశాలలో లక్షల సంఖ్యలో మరణించగా మన దేశంలో వేల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడ్డారు ..దీంతో ఈ వ్యాధి బారి నుండి ప్రపంచం ఎప్పుడు బయట పడుతుందనే దానిమీద అంతటా ఆసక్తి నెలకొంది ..దీనిపై వైజాగ్ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు …వాటిపై అంతటా ఆసక్తి నెలకొంది ..వివరాల్లోకి  వెళ్తే ..

Video Advertisement

స్వామి స్వరుపానందేంద్ర ఈయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు .ఈయన రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు ..పూర్వం రాజులు అధికారం కోసం ఈ అమ్మవారిని ఆరాధించేవారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా ఈయన దగ్గరకు తరచుగా  వెళ్తుండేవారు ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఈయనను సంప్రదిస్తూంటారు….ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులు కావడానికి  స్వరూపానందేంద్ర స్వామి చేసిన పూజలే కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు ..దీంతో స్వామి స్వరూపానందేంద్ర అందరి దృష్టిని తనవైపు ఆకర్షించారు ..

కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ భారతదేశం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను చాలానే చూసిందని ,కరోనా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదని అన్నారు .ప్రజలందరూ భగవంతుడిని ప్రార్ధించాలని సూచించారు .ఈ సమయంలో దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండటమే మనకి రక్షణ అని అన్నారు .లాక్ డౌన్ సమయంలో అందరు ఆధ్యాత్మిక జీవనం గడపాలన్నారు.పిల్లలలో భక్తి భావన పెంచాలని విజ్ఞప్తి చేసారు ..

 

‘ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోంది. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మే 5 తర్వాత ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోంది. కరోనా కారణంగా భారత దేశానికి అంతగా చేటు జరగదు. కరోనా ప్రభావం తగ్గలని రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం అని స్వామి స్వరూపానందేంద్ర వెల్లడించారు .