“స్వాతిముత్యం” ఫేమ్ “దీప” గుర్తున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారో? ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

“స్వాతిముత్యం” ఫేమ్ “దీప” గుర్తున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారో? ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

by Mohana Priya

Ads

తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే డైరెక్టర్, హీరో కాంబినేషన్స్ లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇంకా కమల్ హాసన్ గారి కాంబినేషన్ ఒకటి. స్వాతిముత్యం, శుభ సంకల్పం, సాగర సంగమం సినిమాలు ఇప్పటికీ క్లాసిక్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాకి ఒక గొప్ప తనం ఉంది.

Video Advertisement

ముఖ్యంగా స్వాతిముత్యం. ఆ సినిమాలో అమాయకుడిగా కమల్ హాసన్ చేసిన పర్ఫామెన్స్ కి ఎంత చెప్పినా కూడా తక్కువే. స్వాతిముత్యం సినిమా కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. కానీ ఆ సినిమాలో కమల్ హాసన్ నటన పాట రూపంలో లేదా ఎక్కడైనా ఒక సీన్ రూపంలో చూసే ఉంటారు.

ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా ఎంతో బాగా నటించారు. స్వాతిముత్యం సినిమాలో సుబ్బులు పాత్రలో నటించిన దీప సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటారు. దీప తనకి 7 ఏళ్ల వయసున్నప్పుడు ఒక మలయాళం సినిమా తో బాల నటి గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు.

తర్వాత ఎన్నో మలయాళం, తమిళ్ సినిమాలు చేశారు. 1976 లో వచ్చిన అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దీప. దీప అసలు పేరు ఉన్ని మేరీ. సినిమాల కోసం తన పేరుని దీప గా మార్చుకున్నారట. దీప తర్వాత పంతులమ్మ, రంగూన్ రౌడీ, ఆత్మబలం, లేడీస్ టైలర్, స్వాతిముత్యం, రాము ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు.

1990 లో వచ్చిన కలియుగ విశ్వామిత్ర దీప నటించిన చివరి తెలుగు సినిమా. దీప తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు. అంతేకాకుండా హిందీ లో కూడా రెండు చిత్రాల్లో నటించారు. 1982 లో ఎర్నాకులం లోని సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన రెజోయ్ ని పెళ్లి చేసుకున్నారు దీప. వాళ్లకి నిర్మల్ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు. నిర్మల్ భార్య పేరు రంజని. వాళ్ళ కొడుకు పేరు రిహాన్.


End of Article

You may also like