మద్యం మత్తులో ఎంత పని చేసాడో చూడండి….బండికి అడ్డంగా పాము వచ్చిందని మద్యం మత్తులో.

మద్యం మత్తులో ఎంత పని చేసాడో చూడండి….బండికి అడ్డంగా పాము వచ్చిందని మద్యం మత్తులో.

by Megha Varna

Ads

మాములుగా జనాలు పామును చూడడానికే భయపడతారు . కానీ ఆ వ్యక్తి మాత్రం దానిని కొరికి కొరికి చంపేశాడు .అది కర్ణాటకలోని … కోలార్ లో జరిగిన ఘటన . లాక్ డౌన్ వలన ఈ మధ్యనే మద్యం దొరకడంతో అప్పుడే తాజాగా కొనుకున్న మందు బాటిల్ తో ఇంటికి వెళ్తున్నాడు 38 ఏళ్ళ కన్స్ట్రక్షన్ వర్కర్ కుమార్ . మస్తూర్ గ్రామానికి చెందిన కుమార్ అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు .ఆలా బైక్ మీద వెళ్తుండగా ఓ పాము కుమార్ బైక్ కు అడ్డంగా వచ్చింది .ఇంటికి ఎప్పుడు వెళ్లి క్వార్టర్ ఫినిష్ చేద్దామా అనే మూడ్ లో ఉన్న కుమార్ కు దానిని చూడగానే పిచ్చి కోపం వచ్చింది .

Video Advertisement

బైక్ మీద వెళ్తుండగా చక్రాల మధ్యకు పాము అడ్డురావడంతో చిరాకు వచ్చి పామును మేడలో వేసుకొని కొరికి చంపేశాడు । పాములు చాలా విషపూరితమైనవి కదా అసలు ఆలా ఎలా కొరికేస్త్తున్నాడని చుట్టూ ఉన్న జనం ఫోటోలు ,వీడియోలు తీశారు

స్థానికుల నుండి సమాచారం అందిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుమార్ ఇల్లు ఎక్కడో తెలుసుకొని వెళ్లి కుమార్ ని అడగగా ఇలాంటి పాములను చాలానే చూసాం నాకు ఏమి అవ్వదు అని బదులిచ్చాడు .దీంతో అక్కడికి వచ్చిన ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను అక్కడే ఉంచి అవసరమైతే కుమార్ ను ఆసుపత్రికి తరలించామని ఆదేశం ఇచ్చారు

 


End of Article

You may also like