సంక్రాంతి సినిమాల పోటీ ఎలా ఉంటుందనేది ప్రతిసారీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు కానీ ఈసారి అసలు సిసలు ఫైట్ ఎలా ఉంటుందో మాత్రం తెలిసింది. ఈ సారి నాలుగు సినిమాలు వచ్చాయి ,సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల… వైకుంఠపురములో’. కళ్యాణ్ రామ్ నటించిన “ఎంత మంచివాడవురా” సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు అటు ఇటుగా భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ అండ్ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతున్నాయి.
ముఖ్యంగా అందరికంటే రెండు రోజుల జనవరి 9న దర్బార్ అంటూ బరిలోకి దిగాడు మన సూపర్ స్టార్ రజినీకాంత్ , ఎవరికీ లేని అడ్వాంటేజ్ పండగ హీరోల్లో ఈయనకు ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టినా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ థియేటర్స్ అయితే లేవు.
జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో ఎటువంటి సినిమా వచ్చినా తప్పకుండా ఆడుతుంది. ప్రధాన పోటీ మాత్రం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మధ్యే ఉంది.
మీడియా లో యాడ్స్ లో ‘సంక్రాంతి విన్నర్’ అంటూ తమ సినిమాకు ట్యాగ్ తగిలించారు అల… వైకుంఠపురములో యూనిట్ . తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ఆ యూనిట్ ప్రకటించుకుంది.ఆ ట్యాగ్ కు కౌంటర్ గా మరో ట్యాగ్ ను వదిలింది సరిలేరు నీకెవ్వరూ యూనిట్. మొదటి రోజు తమ సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్న ఈ సినిమా రూపకర్తలు ఇప్పుడు తమ సినిమాకు ట్యాగ్ లైన్ మార్చారు. ‘అసలు సిసలైన సంక్రాంతి విజేత ‘ అట. ఈ సినిమాకు ఇప్పుడు ఈ ట్యాగ్ ను తగిలించారు.
అల యూనిట్ ఏమో తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంటుంటే, సరిలేరు యూనిట్ మాత్రం తమ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ అంటున్నారు. ఇప్పుడు ట్యాగ్ లు, కౌంటర్ ట్యాగ్ లతో ఇరు సినిమాల వాళ్లూ తమ పోటీని ధ్రువీకరించినట్టుగా అయ్యింది. అయితే వీటి గోలలో పడి మిగతా సినిమాలు ‘దర్భార్’ ‘ఎంతమంచివాడవురా సినిమాల పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం.
ఒకటి మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటే మరోటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి విడుదల అయిన రెండు పెద్ద సినిమాలు కూడా విన్నర్ అయినట్లే..