Weekly Horoscope Telugu 2021 : Rashi phalau This week Telugu, Horoscope this week Telugu, ఈ వారం రాశి ఫలాలు ఈ వారం రాశి ఫలాలు తెలుగు లో మీకోసం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు అనగా ఆగష్టు 01 తారీఖు నుంచి ఆగష్టు 07 తారీకు వరకు వివరాలు రేపటి రాశి ఫలాలు కావాలి తెలుసుకుందాం.
మేష రాశి:WEEKLY HOROSCOPE TELUGU 2021 ఈ రాశి వారు ఎవరితోనూ వాగ్వాదాలు చేయకపోవడమే మంచిది. అన్ని విధాలా మీకు అనుకూల సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాల బాగుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి కఠిన శ్రమ తప్పదు. ఆర్థికంగా గత వారం కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంది. ఎవరైతే ఉన్నత ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఎవరైతే నూతన ఆదాయాల కోసం ప్రయతిన్స్తున్నారో వారికి అన్ని విధాలా బాగుందని చెప్పవచ్చు.
మిథున రాశి: గత కొంత కాలంగా మీరు పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తోటి సోదరుల నుంచి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ వారం చివర్లో అధిక ఖర్చులు. మీరు మీ కుటుంబ శ్రేయస్సు కోసం, మీ భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు, బంధువులు స్వాగతిస్తారు. వ్యాపార వర్గాల వారికి లాభ సాటిగా ఉంటాయి. వీరికి కలిసొచ్చే రంగు నీలి, నేరేడు. శ్రీమహా విష్ణువు ని ఆరాధించడం, విష్ణుసహస్రనామం పఠించడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి: ఈ వారం వ్యాపార రంగాలవారికి పూర్తిగా కలిసివస్తుంది. ఆర్థిక పరంగా ఆశాజనకంగా ఉంది. చేపట్టిన నూతన పనుల్లనింటిలో విజయం మీదే. ఆరోగ్య సమస్యలు తప్పవు. వాహనాలు, భూముల కొనుగోలుకు పూర్తి అనుకూలం. సమాజం లో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం. ఆలయాల సందర్శన, సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, ఉద్యోగ రంగాల వారికి సమస్యలు, చికాకులు తొలిగి పోతాయి. వీరికి కలిసొచ్చే రంగు తెలుపు, ఆకుపచ్చ,
సింహ రాశి: మీ స్నేహితుల నుంచి పూర్తి సహాయ సహకారాలు తప్పక ఉంటాయి. వ్యాపార రంగాలవారికి తమ వ్యాపారం కోసం కొన్ని పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా పూర్తి అనుకూలం, మీ బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండటం అవసరం. మానసికంగా అశాంతి, రాజకీయ రంగాలవారికి అనుకూలం, ఎవరితో ఉద్యోగంలో మార్పుల కోసం ఎదురు చూస్తున్నారో వారికీ పూర్తి అనుకూలం. ఎరుపు రంగు, గులాబీ రంగు ఈ రాశి వారికి కలిసొస్తుంది. విగ్నేశ్వరున్ని ఆరాధించడం మంచిది.
కన్య రాశి: వ్యాపార రంగాలవారికి పూర్తి అనుకూలం, బంధువులతో కొంత మేరకు విబేధాలు, ఆర్థికపరంగా పూర్తి అనుకూలం, మీ సోదరులతో మరింత ఉల్లాసంగా ఉత్సహంగా ఉంటారు. ఆలయాల సందర్శన, కఠిన శ్రమ తప్పదు, గత కొంత కాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరి కుదుట పడతారు. ఉద్యోగ రంగాలవారికి పూర్తి అనుకూలం. మీ ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వీరికి కలిసొచ్చే రంగు పసుపు, నేరేడు.
తుల రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం, కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి, ఉద్యోగ రంగాల వారికి పూర్తి అనుకూలం, వ్యాపార రంగాలవారికి పూర్తిగా అనుకూలం, వృధా ఖర్చులు తప్పవు, మీ చిన్న నాటి మిత్రులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరైతే రుణాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది, భూములు, స్థలాల కొనుగోలుకు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నీలం, నేరేడు.
వృశ్చిక రాశి: ఆర్థిక పరంగా పూర్తి అనుకూలం, ఉద్యోగస్తులకు మీ సహా ఉద్యోగులతో ఉన్న సమస్యలు తీరిపోతాయి, వ్యాపార రంగాలవారికి అనుకూలం, అనూహ్యంగా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం, వివాహం, ఉద్యగం కోసం చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సమాజం లో మీ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి, పసుపు, ఎరుపు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు.
ధనుస్సు రాశి: ఎవరైతే తమ వ్యాపార విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారో వారికి పూర్తి అనుకూలం. ఆర్థికపరంగా పూర్తి అనుకూలం, చేసిన రుణాలు కూడా తీరుస్తారు, వృథా ఖర్చులు తప్పవు, మీ కుటుంబసమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు, కొన్ని బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి. నూతన వ్యక్తుల నుంచి పరిచయాలు లభిస్తాయి, నేరేడు, గులాబీ రంగు ఈ రాశివారికి కలిసొచ్చే రంగు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.
మకరం రాశి: ఆలయాల సందర్శన, ఎవరైతే ఉద్యోగం, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి పూర్తి అనుకూలం, వ్యాపార రంగాలవారికి పూర్తి అనుకూలం, కుటుంబ సభ్యులతో విబేధాలు, సంపాదన కోసం చేస్తున్న ప్రయత్నాలు లభిస్తాయి, వారం మొదట్లో కొన్ని అవాంతరాలు, సమస్యలు తప్పవు, కళారంగాలవారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, నేరేడు.
కుంభo రాశి: గత కొంత కాలంగా మిమల్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. భూతగాదాలు, వివాదాలు పరిష్కరించుకుంటారు, కఠిన శ్రమ తప్పదు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు, వ్యాపార రంగాలవారికి పూర్తి అనుకూలం, లాభసాటిగా వ్యాపారాలు కొనసాగిస్తారు, సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపు, నీలం. నరసింహస్వామి వారిని పూజించడం మంచిది.
మీనం రాశి: వ్యాపారరంగాలవారికి అనుకున్నంత లాభసాటి ఉండకపోవచ్చు, ఉద్యోగస్తులకు పని లో ఒత్తిడి తప్పదు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు, ఆస్తుల విషయంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు, మిత్రులతో విబేధాలు తప్పవు, వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ఎరుపు గులాబీ వీరికి కలిసొచ్చే రంగు.