డైరెక్టర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తకు తెరపడింది. మే 10 రాత్రి 11 గంటలకు నిజామాబాద్లో నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. మదర్స్ డే రోజున ఆయన కూతురు పెళ్లి పెద్దగా మారి తండ్రి పెళ్లి చేయడం విశేషం. నిన్న ఉదయమే దీని గురించి అప్డేట్ కూడా ఇచ్చారు దిల్ రాజు. 2017 లో దిల్ రాజు గారి భార్య అనిత మరణించడంతో ఆయన ఒంటరివారు అయ్యారు. దీంతో ఆయనకీ తోడుకావాలని కూతురు భావించారట.
ఇది ఇలా ఉండగా…దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నది ఎవరు అనే విషయంపై నెటిజెన్స్ ఆసక్తి చూపుతున్నారు. దిల్ రాజు గారు పెళ్లి చేసుకున్న వధువు రాజుగారికి చాలా రోజులు నుండే పరిచయం అంట. ఆమె పేరు తేజస్విని. తేజస్విని కుటుంబానిది వరంగల్ కాగా హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. ఈమె గతంలో ఎయిర్ హోస్ట్రెస్గానూ పని చేసిందట. ఆమె తల్లితండ్రులు అమెరికాలో ఉంటారంట. వారు కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో దిల్ రాజు కూతురు పెళ్లి పెద్దగా మారి తండ్రికి పెళ్లి చేసారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా గుడిలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.