ఎంత అందంగా ఉండీ, చక్కటి పలువరస ఉండీ, హాయిగా నవ్వగలిగి ఉండీ ఏం లాభం? దంతాలు పచ్చగా, గార పట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధాగా పోతుంది. దంతాలు పచ్చగా, గార పట్టి ఉంటే ఎవరికీ నచ్చదు. తెల్లగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు.అందమైన చిరునవ్వుకు.. పచ్చగా మారిన పళ్లు ఇబ్బందిగా మారుతున్నాయా? టూత్ పేస్ట్లు పెట్టి గంటల తరబడి రుద్దినా పళ్లపై పాచి అలాగే ఉంటున్నదా? చింతించకండి.!పచ్చగా మారిన దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం రెండు పదార్థాలను తీసుకుంటే చాలు.
1) బేకింగ్ సోడా, నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా (ఎక్కువ కాకూడదు సుమా)ను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది.
2) ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారుతాయి.