మన జీవితంలో ఎవరికైనా తీర్చుకోలేని ఋణం ఉంటుంది అంటే అది తల్లిదండ్రులకు మాత్రమే. వారు మనల్ని పెంచి పెద్ద చేసి నందుకు మనం ప్రయోజకులు అయ్యి వాళ్లకి ఏం చేసినా అది వాళ్ల కష్టం త్యాగం ముందు తక్కువే. అలా వాళ్లు చేసిన ఎన్నో గొప్ప పనులను ప్రపంచమంతా గుర్తు చేసుకొని ఘనంగా జరుపుకునే రోజులు మదర్స్ డే ఫాదర్స్ డే. అమ్మకి కృతజ్ఞతగా మదర్స్ డే ని జరుపుకుంటాం. అదేవిధంగా తండ్రికి ఫాదర్స్ డే అంకితం ఇస్తాం. కానీ మీకు తెలుసా ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక ఒక చిన్న కథ ఉంది.
ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక ఉన్న ఒక చిన్న కథ
వాషింగ్టన్లో ఒక కుటుంబం. వారికి ఆరుగురు కూతుళ్ళు. తల్లి చనిపోవడంతో తండ్రి చిన్నప్పటి నుండి వాళ్లందరినీ పెంచి పెద్దచేశాడు. అందుకే ఆయన పుట్టిన రోజును ఫాదర్స్ డే గా జరుపుకునేలా వాళ్ళ కూతురు నిర్ణయించుకున్నారు. అలా వారి కుటుంబానికి మాత్రమే పరిమితమైన ఈ ఫాదర్స్ డే ఆచారం, మెల్లగా ప్రపంచం అంతటా విస్తరించింది. 1966లో ఫాదర్స్ డే కి అధికారికంగా గుర్తింపు లభించింది.
1910లో ఫాదర్స్ డే ప్రారంభమైనా, గుర్తింపు వచ్చింది మాత్రం 1972లో. పిల్లల కోసం తమ జీవితాలను ధార పోసే తండ్రులకి కూడా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డే ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ మూడవ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే ని జరుపుకుంటారు.
కాలం ఎంత మారినా ఇప్పటికీ తండ్రి అంటే భయపడే పిల్లలు ఉంటారు, తండ్రిని ఒక స్నేహితుడిగా భావించి తన మనసులోని మాటలు అని చెప్పుకునే పిల్లలు కూడా ఉంటారు. ఏది ఏమైనా నా తండ్రి తండ్రే. మనతో మాట్లాడిన మాట్లాడకపోయినా ఒక తండ్రి చేయాల్సిన పనులు బాధ్యతలు ఆయన తప్పకుండా నిర్వర్తిస్తారు. మనం తప్పు చేసినప్పుడు మందలిస్తారో, మనం బాధలో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తారు. ఒక్క ఫాదర్స్ డే నే కాదు మనం బతుకుతున్న ప్రతిరోజు, మనం ఎక్కుతున్న ప్రతి మెట్టు, సాధించిన ప్రతి విజయం మన తల్లిదండ్రుల కే అంకితం.ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం (ఫాదర్స్ డే) జరుపుకుంటారు.. హ్యాపీ ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే విషెస్,ఫొటోస్,గ్రీటింగ్ కార్డ్స్
మనకి తండ్రి విలువ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.
నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు.
పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’
మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’
Best Father’s Day Quotes in Telugu (‘ఫాదర్స్ డే’ )
మనమెక్కిన తొలి విమానం… మన తండ్రి “భుజాలే!
నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.
నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప!
బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
Happy Father’s Day Wishes In Telugu
నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
నాన్నా.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే. నా మంచి, చెడు, ఆనందం, విజయం.. అన్నింటి వెనకా మీరే ఉన్నారు. నా కోసం ఎంతో త్యాగం చేశారు.
గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే.
Heart Touching Nanna Love Quotations in Telugu I Love You Nanna Telugu Daddy Quotations Images :
ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’
నాన్నా.. ఈ ప్రపంచంలో బెస్ట్ డాడీ మీరే. మిమ్మల్ని నాన్నగా పొందడం నా అదృష్టం.
నాన్నా.. మీరే నా సూపర్ హీరో. ఐ లవ్యూ డాడీ.. హ్యాపీ ఫాదర్స్ డే!!